Marriage : పెళ్లి చేసుకొని వదిలేసిన యువకుడు.. మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో హిజ్రా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

Marriage : పెళ్లి చేసుకొని వదిలేసిన యువకుడు.. మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య

Marriage (2)

Marriage : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో హిజ్రా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన గుణ అలియాస్ స్వప్న (24) మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటుంది.

చదవండి : Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

మూడు నెలల క్రితం బైక్ మెకానిక్ నిషాంత్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దీ రోజులకే వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. రెండు నెలలు ఇద్దరు కలిసే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతవారం నిషాంత్ తండ్రి ఫోన్ చేసి ఇంటికి రావాలని తెలిపాడు. దీంతో నిషాంత్ తన సొంతవూరు.. నల్గొండ జిల్లా నిడమానూరుకి వెళ్ళాడు.

చదవండి : Marriage : వధువు వింత షరతు : పెళ్ళికి వచ్చేవారు ‘ఏడువేలు’ తీసుకురండి!

ఇదే సమయంలో నిషాంత్ హిజ్రాను పెళ్లిచేసుకున్నట్లుగా తల్లిదండ్రులకు తెలియడంతో అతడిని హైదరాబాద్ రానివ్వలేదు. దీంతో తనను హైదరాబాద్ రానివ్వడం లేదని స్వప్నకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. నిషాంత్ తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్ తీసుకురావాలనే ఉద్దేశంతో స్వప్న నిడమానూరు వెళ్ళింది.. అయితే వారి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. నిషాంత్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులను స్టేషన్‌కి పిలిపించిన పోలీసులు.. విచారించారు.

చదవండి : Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

విచారణలో తనకు స్వప్న అంటే ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై హైదరాబాద్ వచ్చేసింది.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి వచ్చి మృతదేహం స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.