రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free

  • Published By: madhu ,Published On : July 2, 2020 / 08:26 AM IST
రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free

భారతదేశాన్ని ఇప్పట్లో కరోనా భూతం వీడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే..ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..ఏ మాత్రం ఫలితం ఇవ్వడం లేదు. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. కానీ…వైరస్ రాకుండా ఉండాలంటే..ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా..రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ప్రజలు ప్రయత్నించాలని, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకొంటే..వైరస్ దరి చేరదని అంటున్నారు. అందులో ప్రధానంగా Vitamin C ఉన్న వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. పైనాపిల్, నిమ్మకాయలను ప్రజలకు పంచాలని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిప్లమ్ కుమార్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

పైనాపిల్‌, నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుందని, తద్వారా వైరస్ ను కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ముఖ్యమంత్రి కరోనా రెసిస్టెన్స్ క్యాంపెయిన్ కింద పైనాపిల్‌తో పాటు నిమ్మరసాన్ని ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధారణ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ రెండు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కరోనాను ఎదుర్కోవటానికి, శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అవసరమని ప్రభుత్వం అనుకొంటోంది.  జూన్ 30 న ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కరోనా రెసిస్టెన్స్ ప్రచారానికి ఆమోదం తెలిపింది. జూలై 4 శనివారం నుంచి ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది. 25 పట్టణ సంస్థలు మరియు సబ్ డివిజన్ ప్రధాన కార్యాలయాలలో ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా పంపిణీ చేయబడుతుంది.

ఈ పండ్లను రైతుల నుంచి నేరుగా సేకరించనున్నారు. దీని ద్వారా వారికి లబ్ది చేకూరనుంది. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఆ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధకశక్తి పెంచుకోవడమే మన ముందున్న మార్గమని నిపుణులు చెబుతున్నారు.

Read:పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!