SSMB28: త్రివిక్రమ్ ఈసారి మరో సీనియర్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్నాడుగా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు ఒకప్పటి స్టార్ బ్యూటీ శోభనను తీసుకొస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.

SSMB28: త్రివిక్రమ్ ఈసారి మరో సీనియర్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్నాడుగా..?

Trivikram To Bring Actress Shobana For SSMB28

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్‌ను మరోసారి ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నాడు ఈ డైరెక్టర్.

Shobana : సీనియర్ నటి శోభనకి ఒమిక్రాన్..

మహేష్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేసిన త్రివిక్రమ్, ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసిన త్రివిక్రమ్, ఇప్పుడు ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు ఒకప్పటి స్టార్ బ్యూటీ శోభనను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో శోభన పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయలేదు.

SSMB28: మహేష్ బాబు సినిమా అందుకే ఆలస్యం అవుతుందా..?

దీంతో మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాతో ఆమె సెకెండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండనుండటంతో ఈ పాత్రకు శోభన అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మరి నిజంగానే మహేష్ బాబు సినిమాలో శోభన నటిస్తుందా లేదా అనేది చూడాలి.