Trivikram: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్తను పట్టుకొస్తున్న త్రివిక్రమ్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన నెక్ట్స్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ యాక్టర్‌ను దింపేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ యంగ్ నటుడు, స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌషల్‌ను ఈ సినిమాలో ఓ నెగెటివ్ రోల్ కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడట.

Trivikram: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్తను పట్టుకొస్తున్న త్రివిక్రమ్..?

Trivikram To Bring Vicky Kaushal As Villain For SSMB28

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన నెక్ట్స్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఆలస్యం కానుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు మొత్తాన్ని త్రివిక్రమ్ మార్చేశాడని, షూటింగ్ చేసుకున్న తొలి షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

Trivikram : హిట్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా?.. అసలు ఇద్దరికీ సెట్ అవుతుందా??

అయితే తాజాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ యాక్టర్‌ను దింపేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ యంగ్ నటుడు, స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌషల్‌ను ఈ సినిమాలో ఓ నెగెటివ్ రోల్ కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడట. మహేష్ లాంటి స్టార్‌తో ఢీకొనే పాత్రలో ఈ బాలీవుడ్ యాక్టర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాడని, త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇక అనుకోవడమే ఆలస్యం, విక్కీతో ఈ స్క్రిప్టు నెరేషన్ కోసం త్రివిక్రమ్ రెడీ కూడా అవుతున్నాడట.

Trivikram: మహేష్ కోసం త్రివిక్రమ్ తొలిసారి అలాంటి పని చేస్తున్నాడా..?

త్వరలోనే విక్కీ కౌషల్‌ను కలిసి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును వినిపిస్తాడట. మరి నిజంగానే ఈ సినిమాలో మహేష్‌కు విలన్‌గా విక్కీ కౌషల్‌ను త్రివిక్రమ్ పట్టుకొస్తాడా అనేది వేచి చూడాలి. కాగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.