Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

munugode by-election (1)

Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 1వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం ఉంది. 2,3వ రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 4,5 రౌండ్ లో టీఆర్ఎస్ లో ఆధిక్యంలో ఉంది.

మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ 6317, బీజేపీ 5127 ఓట్లు. టీఆర్ఎస్ 1190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెడో రౌండ్ లో టీఆర్ఎస్ 7781, బీజేపీ 8623 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ 7387, బీజేపీ 7426 ఓట్లు వచ్చాయి. నాల్గో రౌండ్ లో టీఆర్ఎస్ 4855, బీజేపీ 4560 ఓట్లు సాధించాయి. ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ 6062, బీజేపీ 5245 ఓట్లు వచ్చాయి.

Munugode Bypoll: ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదు: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 32,605 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,974 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 10,055 ఓట్లు వచ్చాయి. అంతకముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. టీఆర్ఎస్ కు 228, బీజేపీకి 224 ఓట్లు, కాంగ్రెస్ కు 136 ఓట్లు వచ్చాయి.