Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగటం కష్టమంటూ విలేకరుల సమావేశంలో తాటి తేల్చి చెప్పారు.

Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు

Tati (1)

Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవలే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేట్ విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేశారు. తాజాగా మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలో టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో కార్యకర్తలతో సహా తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. 2018 ఎన్నికలలో ఓటమి తరువాత….టిడిపిలో గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఇటీవలే గులాబీ పార్టీలో చేరారు. నాటి నుండి ప్రాధాన్యత తగ్గించారంటూ తాటి ఆవేదన చెందుతున్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగటం కష్టమంటూ విలేకరుల సమావేశంలో తాటి తేల్చి చెప్పారు. కేటీఆర్ అందర్ని కలుపుకుని పోవాలంటే మాజీలను వేరు బంధం చేస్తున్నారని వాపోయారు. తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ తరపున 1999 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి

టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజవకర్గం నుండి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత మెచ్చా నాగేశ్వరరావు సైతం టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఇక్కడ ఆధిపత్య పోరు పొడచూపుతున్నాయి.

ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకి షాక్ ఇచ్చారు. కరకగూడెం జడ్పీటీసీ సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. ములుగు ఎంఎల్ఏ సీతక్క సహకారంతో రేవంత్ రెడ్డి అధ్వర్యంలో 100మందితో చేరనున్నారు. ఇదే బాటలో మరికొంత మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టిఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.