MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు మరో షాక్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపాలన్న హైకోర్టు

మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు మరో షాక్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపాలన్న హైకోర్టు

MLAs Poaching Case : ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీజేపీ తరపున మహేశ్ జెఠ్మలాని, సిట్ తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. బీఎల్ సంతోష్.. సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు అంది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రమేయం ఉన్నట్లు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సిట్ కు సూచించింది హైకోర్టు. ఇప్పటికే సిట్ పోలీసులు ఢిల్లీ వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని కరోరారు. కానీ, ఆయన మాత్రం రాలేదు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు అభ్యంతరం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని చెప్పింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందన్నట్టుగా భావిస్తున్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి.. తుషార్, జగ్గుస్వామితో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించడంతో.. వారిని విచారణకు పిలిపించేందుకు సిట్ అధికారులు యత్నించారు. అయితే వారిద్దరూ కనపించకపోవడంతో వారిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. వారు దేశం విడిచి పోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు సర్క్యులర్లు పంపారు.