Telangana High Court : తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్.. సిట్ నోటీసులు రద్దు చేయలేమన్న న్యాయస్థానం

తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Telangana High Court : తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్.. సిట్ నోటీసులు రద్దు చేయలేమన్న న్యాయస్థానం

Telangana High Court : తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సిట్ నోటీసులను తాము రద్దు చేయలేము అని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, శ్రీనివాస్ కు నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అయ్యిందని హైకోర్టు ప్రశ్నించింది.

సిట్ దర్యాఫ్తు గోప్యంగా ఉంచాలని, అలాగే దర్యాఫ్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు సూచించింది. కాగా, అరెస్ట్ విషయంలో మాత్రం బీజేపీకి ఊరట కలిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 41ఏ సీఆర్ పీసీ కింద బీఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అలాగే సిట్ దర్యాఫ్తునకు బీఎల్ సంతోష్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు 41ఏ నోటీసులు ఢిల్లీ పోలీసులకు ఇవ్వాలని, వారు బీఎల్ సంతోష్ కు నోటీసులు అందిస్తారని కోర్టు చెప్పింది. సిట్, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. ఏకంగా బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేయడం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. బీఎల్ సంతోష్ కు జారీ చేసిన సిటీ నోటీసులను రద్దు చేయాలని కోరింది.

బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బీఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది.