ఫిబ్రవరి 10న హాలియాలో టీఆర్ఎస్ భహిరంగ సభ..పాల్గోనున్న సీఎం కేసీఆర్

ఫిబ్రవరి 10న హాలియాలో టీఆర్ఎస్ భహిరంగ సభ..పాల్గోనున్న సీఎం కేసీఆర్

TRS public meeting on February 10 in Halia : నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం శంఖారావం పూరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గోనున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన వరాలు ప్రకటించే అవకాశముంది.

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరిత గతిన నిర్మించనున్నట్లు వెల్లడించారు.

రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంఖుస్థాపన చేయాలని నిర్ణయించారు. నెల్లికల్లులో 3వేల కోట్లతో 9 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12.30కు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో టీఆర్‌ఎస్ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు.