TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల

బాలురలో 87.61 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, బాలికల్లో 92.45 శాతం మంది పాసయ్యారు. బాలురుకంటే బాలికలు 4.84 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాదికి సంబంధించి మే 28 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల

Ts 10th Results

TS 10th Results: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేశారు. 90 శాతం విద్యార్థులు అంటే 4,53,201 మంది పాసయ్యారు.

N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్

బాలురలో 87.61 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, బాలికల్లో 92.45 శాతం మంది పాసయ్యారు. బాలురుకంటే బాలికలు 4.84 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాదికి సంబంధించి మే 28 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ నెల రెండో తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన మొత్తం 5,09,307 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో 5,04,398 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది కాగా, 819 మంది ప్రైవేటుగా హాజరయ్యారు. ఈ ఏడాది ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 51.89.

CM JAGAN: ఆటో ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం ప్రకటన

వీరిలో బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 46.21, బాలికల ఉత్తీర్ణతా శాతము 58.79. బాలుర కంటే బాలికలు 12.55 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాదికి సంబంధించి 3007 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించియి. సిద్ధిపేట జిల్లాలో అత్యధికంగా 97.85 శాతం మంది పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ.. అంటే 79.63 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. గత సంవత్సరం 5,21,073 మంది హాజరయ్యారు.