TS High Court: మంచిరేవులలో ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే: పదేళ్ల తరువాత హైకోర్ట్ తీర్పు

గండిపేట్ మండల పరిధి మంచిరేవులలోని సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే

TS High Court: హైదరాబాద్ నగర శివారు గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో గతంలో పోలీస్ శాఖకు (గ్రేహౌండ్స్) కేటాయించిన 142 ఎకరాల భూములపై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. గండిపేట్ మండల పరిధి మంచిరేవులలోని సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న142 ఎకరాల భూమిని.. ప్రభుత్వం అప్పట్లో(2010కి ముందు) గ్రేహౌండ్స్ కు కేటాయించింది. అయితే ఆ భూములు తమవంటూ కొందరు రియల్టర్లు 2010లో కోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ఆభూములను కబ్జా చేసి వెంచర్లు కూడా వేశారు.

Also read: Minister KTR: నల్లగొండలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అయితే దీనిపై ఆనాటి నుంచి కోర్టులో విచారణ జరుగుతుండగా.. పోలీస్ శాఖ, అడ్వొకేట్ జనరల్, ఇతర రెవిన్యూ అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం.. శుక్రవారం నాడు ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్ట్ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా భూముల విలువను ప్రస్తావించిన కోర్టు.. ఇప్పటి లెక్కల ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. ఇక భూములను ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా కృషి చేసిన టీఎస్ డీజీపీ, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ, అడ్వకేట్ జనరల్, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో‌, గండిపేట ఎమ్మార్వోలను హై కోర్ట్ ధర్మాసనం అభినందించింది. ఇప్పటికే ఆ భూములను కబ్జా చేసి… వెంచర్లు వేసిన రియల్టర్లపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు అయ్యాయి.

Also Read: MLA Roja: వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే రోజా

ట్రెండింగ్ వార్తలు