TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు.

TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

Ts Inter Year Result 2021

TS Inter Results: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు. కరోన కారణంగా గత సంవత్సరం కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొదటి సంవత్సరం పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత…సెకండియర్ వి కొన్ని ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రథమ, ద్వితీయ పరీక్షలను రద్దు చేశారు. ఫస్టియర్ లో వచ్చిన మార్క్ లను సెకండియర్ లో కంటిన్యూ చేస్తూ..ఫలితాలను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 51 వేల మంది విద్యార్థులు పరీక్షాల ఫీజులు చెల్లించారు. వీరందరినీ పాస్ చేస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2 లక్షల 28 వేల 754 మంది బాలికలు ఉండగా..2 లక్షల 22 వేల 831 మంది బాలురున్నారని వెల్లడించారు.
ఏ గ్రేడ్ : లక్షా 76 వేల 719 మంది.
బి గ్రేడ్ : లక్షా 4 వేల 886 మంది.

సి గ్రేడ్ : 61 వేల 887 మంది.
డి గ్రేడ్ : లక్షా 8 వేల 093 మంది సాధించారు.

కరోనా కారణంగా..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ముందు పరీక్షలను రద్దు చేశారు. అనంతరం సెకండియర్ పరీక్షలను నిర్వహిస్తామని అనుకున్నా..విద్యాశాఖ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా..డెల్టా వేరియంట్ విస్తరిస్తుందని, కరోనా థర్డ్ వేవ్ వ్యాపిస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు పాస్ అయినట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు.