komatireddy rajgopalreddy : తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు..కొత్తగా వచ్చినవారికి పదవులు..కష్టపడినవారికి ఉత్త‘చేతులు’..

తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతాను అనే వార్తలు కొనసాగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ప్రశంసిస్తున్నారు.

komatireddy rajgopalreddy : తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు..కొత్తగా వచ్చినవారికి పదవులు..కష్టపడినవారికి ఉత్త‘చేతులు’..

Komatireddy Rajgopalreddy

komatireddy rajgopalreddy :తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతాను అనే వార్తలు కొనసాగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ప్రశంసిస్తున్నారు. బీజేపీలోకి వెళతాను అనే వార్తల్లో నిజం లేదంటూనే సొంత పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు. అదే సమయంలో బీజేపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ వీడతారు అనే వార్తలు వస్తున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించటానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు యత్నాలు చేస్తున్న ఆయన మాత్రం మాట వినటంలేదు. వీహెచ్..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్ రెడ్డికి పదే పదే నచ్చచెప్పారు. అయినా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మానలేదు రాజగోపాల్ రెడ్డి. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికే పదవులు కట్టబెట్టారు అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో రాజుకున్న సెగలు ఏమాత్రం చల్లారటంలేదు.

సోమవారం సాయంత్రం (7,2022)హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ ముగిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు చేసారు. తనతో మాట్లాడేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వచ్చారన్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చినవారికి పార్టీలో పదవులు ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.

తాను , భట్టి విక్రమార్కలు అన్నదమ్ముల్లా ఉన్నామని..తాను కాంగ్రెస్ ని వీడతాను అనే ఆవేదనతో భట్టి తనతో మాట్లాడేందుకు వచ్చారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను బీజేపీ ఓడిస్తుందని కన్‌ఫ్యూజన్ తో కాదు, క్లారిటీతోనే చెప్పానన్నారు. సీఎల్పీ పదవి విషయమై తాను గతంలో తాను పోటీ పడినట్టుగా గుర్తు చేశారు. తనకు ఇవ్వకపోతే భట్టి విక్రమార్కకు ఈ పదవిని ఇవ్వాలని కూడా తాను పార్టీ నాయకత్వానికి సూచించినట్టుగా చెప్పారు.