Tirumala : నిజా‌మా‌బాద్‌ నుండి తిరు‌మ‌లకు ఆర్టీసీ బస్సులు

తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరు‌మల శ్రీవారి భక్తుల కోసం నిజా‌మా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఏసీ బస్సు‌లను ప్రారం‌భి‌స్తోంది.

Tirumala : నిజా‌మా‌బాద్‌ నుండి తిరు‌మ‌లకు ఆర్టీసీ బస్సులు

Tsrtc Nizamabad

Tirumala :  తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరు‌మల శ్రీవారి భక్తుల కోసం నిజా‌మా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఏసీ బస్సు‌లను ప్రారం‌భి‌స్తోంది. ఈ రోజు నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్‌ బాజి‌రెడ్డి గోవ‌ర్ధన్‌ ఈ కొత్త బస్సు సర్వీసును జెండాఊపి ప్రారంభించనున్నారు.

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకు మరిన్ని సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రతిరోజు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటుతో పాటు శ్రీవారిని దర్శించు కోవాలనుకునే భక్తులకు బస్‌ టికెట్‌, శీఘ్ర దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పిస్తున్నారు. టీటీడీ ప్రత్యేకంగా టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణీకులకు రోజువారీ 300, ప్రత్యేక శీఘ్ర దర్శన వెయ్యి మందికి టిక్కెట్లను జారీ చేయనుందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ లభిస్తుందన్న ఆశాభాశాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్‌ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉందన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నట్ల తెలిపారు. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉందన్నారు.

అయితే బస్‌ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌నూ బుక్‌ చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని గోవర్దన్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వీక్షించాలన్నారు. కనీసం వారం ముందు www.tsrtconline.in నుంచి టికె‌ట్లను బుక్‌ చేసు‌కో‌వా‌లని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైద‌రా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఆర్టీసీ సేవలు మొద‌లైన సంగతి తెలిసిందే.

Also Read : TTD: తిరుమలలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల