TSSPDCL : జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో అక్రమాలు-విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్

విద్యుత్‌ శాఖలో  జూనియర్‌ లైన్‌మెన్‌  ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల  పేపర్‌ లీక్‌ అవటంపై  తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. 

TSSPDCL : జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో అక్రమాలు-విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్

TSSPDCL :  విద్యుత్‌ శాఖలో  జూనియర్‌ లైన్‌మెన్‌  ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల  పేపర్‌ లీక్‌ అవటంపై  తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.  ఈ లీకేజీ వ్యవహారంలో  ఐదుగురు విద్యుత్‌ అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17, 2022 న రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగులు కుట్ర, దురాలోచనతో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడ్డారనే కారణంతో వీరిమీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో విద్యుత్ సంస్థ ఉద్యోగుల రూల్స్ & రెగ్యులేషన్స్ ప్రకారం దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ,ట్రాన్స్‌కోలలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సీఎండీ రఘుమా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తులో సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగంలో నుండి కూడా తొలగిస్తామని సీఎండీ హెచ్చరించారు.

Also Read : Tirumala : టీటీడీ కీలక నిర్ణయం-బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు