Balakrishna : బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుమలలో అభిమానుల పూజలు..

నటసింహ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 101కొబ్బరికాయలు కొట్టి హారతి కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు అభిమానులు..

Balakrishna : బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుమలలో అభిమానుల పూజలు..

Balakrishna

Balakrishna: తిరుమల ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు మెంబర్, తెలుగు యువత నాయకులు ఎన్టీఆర్ రాజు అండ్ సన్స్ బి. శ్రీధర్ వర్మ మరియు భాస్కర్ వర్మ తిరుమల దేవస్థానంలో నటసింహ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 101కొబ్బరికాయలు కొట్టి హారతి కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించారు.

బి. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, అయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నాను, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటిది’’ అని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు తిరుపతి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.