Tuck Jagadish : ఫైన‌ల్‌క‌ట్ చూడ‌గానే ‘ఫిక్సయిపో.. బ్లాక్‌బస్టర్‌’ అని చెప్పాను..

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై ‘మజిలీ’, ‘నిన్నుకోరి’ వంటి బ్యూటిఫుల్ సినిమాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. ఈ సినిమా ట్రైల‌ర్ పోస్ట‌ర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 13న విడ‌ద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఏప్రిల్ 23న సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Tuck Jagadish : ఫైన‌ల్‌క‌ట్ చూడ‌గానే ‘ఫిక్సయిపో.. బ్లాక్‌బస్టర్‌’ అని చెప్పాను..

Tuck Jagadish Movie Press Meet

Tuck Jagadish: నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై ‘మజిలీ’, ‘నిన్నుకోరి’ వంటి బ్యూటిఫుల్ సినిమాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. ఈ సినిమా ట్రైల‌ర్ పోస్ట‌ర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 13న విడ‌ద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఏప్రిల్ 23న సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బాస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్‌లో వస్తున్న‘టక్‌ జగదీష్‌’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో గురువారం జ‌రిగిన ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ ప్రెస్‌మీట్ జరిగింది..

Tuck Jagadish

ఎగ్జ‌ైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం…

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘‘సినిమా ఫైన‌ల్ క‌ట్ చూసుకున్నాం కాబ‌ట్టి టీమ్ అందరిలో తెలియని ఓ ఎగ్జ‌ైట్మెంట్ నిండిపోయింది. ఎడిట్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే ఫంక్ష‌న్‌లో ఎలా మాట్లాడుతామో.. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో అలా మాట్లాడాను.. ‘‘ఫిక్సయిపో..బ్లాక్‌బస్టర్‌’’ అని చెప్పాను. అలాంటి ఓ ఎగ్జ‌ైట్‌మెంట్ ఉంది. కెరీర్‌ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ ఏప్రిల్ నెల‌కు ‘Month of Jagadish’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టాం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చాలా కార్య‌క్ర‌మాలున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు చాలా కీల‌కం అనే సంగ‌తి తెలుసు.. అంద‌రం కోవిడ్ నుంచి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకెళుతున్నాం.

Tuck Jagadish

ఈ ఏప్రిల్‌లో విడుద‌ల కాబోయే ‘వ‌కీల్‌ సాబ్‌’, ‘ల‌వ్‌ స్టోరీ’, ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, ‘విరాట‌ప‌ర్వం’, అలాగే రాబోయే ‘ఆచార్య‌’, ‘నార‌ప్ప’ సినిమాలన్నీ పెద్ద స‌క్సెస్ అయ్యి.. ఈ స‌మ్మ‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీకి స్పెష‌ల్ స‌మ్మ‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఇది మ‌న తెలుగు సినిమా, మ‌న నేటివ్ సినిమా. మ‌న మ‌ట్టి వాస‌న ఉన్న సినిమా అనేలా ఫ్లేవ‌ర్‌తో రేర్‌గా సినిమా వ‌స్తుంటుంది. ఫుల్‌ ఎమోషనల్‌ డ్రామా. మన తెలుగు సినిమా. పదిహేనేళ్ల క్రితం ఫస్ట్‌‌డే ఫస్ట్‌ షో కోసం మన ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూసేవాళ్ల‌మో అలాంటి ఎగ్జ‌ైట్‌మెంట్‌ ఇచ్చే సినిమా ‘టక్‌ జగదీష్‌’. అంద‌రితో క‌లిసి ఫ‌స్ట్ డే మార్నింగ్ షో చూసే వర‌కు ఈ ఎగ్జ‌ైట్‌మెంట్‌ ఇలాగే కంటిన్యూ అవుతుంది.

Nani

సినిమాలోని ఓ ‘రా’ నెస్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ప్ర‌సాద్‌గారు అద్భుతంగా చిత్రీక‌రించారు. రియ‌లిస్టిక్‌గా ఉంటూ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. రేర్‌గా కుదిరే సినిమా. త‌మ‌న్‌తో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌ని అనుకుంటున్నాం. ఇప్ప‌టికి కుదిరింది. ఈ సినిమాకు త‌నకంటే బెస్ట్ సంగీతం ఎవ‌రూ చేయ‌లేర‌న‌పించేలా మ్యూజిక్ ఇచ్చాడు. క‌థ‌లో ఎమోష‌న్స్‌ను అర్థం చేసుకుని త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

Kolo Kolanna Kolo​ Song : ‘యమ ధైర్యంగా ఎదురెళ్లి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా’..

సినిమా చాలా బాగా ఉంది. ల‌డ్డులా ఉంటుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తుంది. కానీ టీజర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ట్రైలర్‌లో మంచి డైలాగ్స్‌ ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా మా సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 13న వైజాగ్‌లో విడుదల చేస్తున్నాం. టీజ‌ర్‌ కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంతోషాన్ని ప్రేక్షకులకు ఇస్తుంది. అలాగే ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ప్లాన్‌ చేశాం. అలాగే త్వ‌ర‌లోనే ట‌క్ థీమ్ మ్యూజిక్‌ను విడుద‌ల చేసేలా కూడా ప్లాన్ చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రెండు తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు మీ ఆశీర్వాదం కోసం ‘టక్‌ జగదీష్‌’ వస్తాడు. అలా ప్లాన్‌ చేశాం. నిర్మాతలు సాహు, హరీష్‌ పెద్ది ప్ర‌మోష‌న్స్‌ ఫుల్ స్వింగ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు’’అన్నారు.

Tuck Jagadish

ప్ర‌తి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా…

హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్‌ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్‌లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామాను తీస్తానో.. లేదో తెలియదు. అందుకే నాకు ఉన్న అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను. నేను ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌ని. నా జీవితంలోనే కాదు.. అంద‌రి ఫ్యామిలీస్‌లోని ఎమోష‌న్స్‌ను ఇందులో చూడొచ్చు. నానిగారు చాలా బాగా చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కోవిడ్‌ బ్రేక్‌ వచ్చింది. అయినా కూడా సరే.. కోవిడ్‌కు ముందు ఎలాంటి ఎనర్జీతో వర్క్‌ చేశామో, అంతే ఎనర్జీతో కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత కూడా షూట్‌ చేశాం. నిర్మాతలు హరీష్, సాహు బాగా హెల్ప్‌ చేశారు. ‘టక్‌ జగదీష్‌’ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తీశాం. ఈ సినిమా ఏ సినిమాకు ప్రేరణ కాదు. నాని సినిమా అంతటా టక్‌ లుక్‌లోనే ఎందుకు కనిపిస్తారు అనేది వెండితెరపై తెలుస్తుంది. తమన్‌ సూపర్బ్ మ్యూజిక్‌ ఇచ్చాడు. కంటిన్యూ అవుతున్న తన సక్సెస్‌లో నా భాగం కూడా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తిరువేర్, ప్రవీణ్‌ మంచి క్యారెక్టర్స్‌ చేశారు’’ అన్నారు.

Tuck Jagadish

అందరికీ నచ్చే సినిమా…

నిర్మాత సాహు గార‌పాటి మాట్లాడుతూ.. ‘‘మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే నానిగారు ఓ సినిమా చేశారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన రెండో సినిమా ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. ఫ్యామిలీ ఆడియన్స్‌కు యూత్‌కు.. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా తీశాం. ఏప్రిల్ 23న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడుతూ.. ‘‘మజిలీ’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాను. అప్పటి నుంచే దర్శకుడు శివ నిర్వాణతో మంచి స్నేహం ఏర్పడింది. శివ అస్సలు కాంప్రమైజ్‌ కాడు. ఎలాంటి స్క్రిప్ట్‌కైనా, ఏ పాత్రకైనా న్యాయం చేయగల హీరో నాని. ఆ సత్తా నానిలో ఉంది. కెరీర్‌లో నాని మరింత ముందుకు వెళ్లాలి. గ్రేట్‌ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్‌ ఉన్న సినిమా ‘టక్‌ జగదీష్‌’.. సినిమా విడుదలైన కొంతకాలం తర్వాత కూడా ఈ సినిమాలోని పాటల గురించి, ఎమోషన్స్‌ గురించి, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అంత బాగా వచ్చింది సినిమా’’ అన్నారు

న‌టుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘‘పుల్‌ఫ్యాక్డ్‌ ఎమోషన్స్, యాక్షన్‌ మిళితమైన ఉన్న సినిమా ‘టక్‌ జగదీష్‌’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రమే కాదు అందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు
యాక్టర్‌ తిరువీర్ మాట్లాడుతూ ‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు..
ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్, ప్రసాద్‌ మూరేళ్ల, నటి శీరిష త‌దిత‌రులు పాల్గొన్నారు..