Twins Experiment: కవలల ప్రయోగం.. ఒకరు వెజిటేరియన్.. మరొకరు నాన్ వెజిటేరియన్‌

ఇద్దరు కవలలు వినూత్నమైన ప్రయోగం చేపట్టి అద్భుతం సృష్టించారు. ఒకరేమో పూర్తిగా శాఖాహారం తింటే మరొకరు అచ్ఛంగా మాంసాహారం తింటూ ప్రయోగం చేశారు. హ్యూగో, రాస్ టర్నర్ అనే అన్నదమ్ములు...

Twins Experiment: కవలల ప్రయోగం.. ఒకరు వెజిటేరియన్.. మరొకరు నాన్ వెజిటేరియన్‌

Twins Experiment: ఇద్దరు కవలలు వినూత్నమైన ప్రయోగం చేపట్టి అద్భుతం సృష్టించారు. ఒకరేమో పూర్తిగా శాఖాహారం తింటే మరొకరు అచ్ఛంగా మాంసాహారం తింటూ ప్రయోగం చేశారు. హ్యూగో, రాస్ టర్నర్ అనే అన్నదమ్ములు చేసిన ప్రయోగ ఫలితం ఇలా ఉంది.

హ్యూగో అనే వ్యక్తి వెజిటేరియన్ గా ఉండేందుకు మాంసం, పాల పదార్థాలు తినడం మానేశాడు. రోస్ అనే వ్యక్తి మొత్తానికి మాంసాహారం, చేపలు, డైరీ ప్రొడక్ట్ లు మాత్రమే తీసుకున్నాడు. ఇలా 12వారాల పాటు సమాన కేలరీలతో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఎక్సర్‌సైజెస్ చేశారు.

నేను పూర్తిగా వెజిటేరియన్ డైట్ లో ఉన్నా. తొలి రెండు రోజులు బాగా ఆకలిగా ఉండేది. చీజ్, మాంసం లాంటివి తినేయాలనిపించేది. అవి నాకు బాగా ఇష్టం. ప్రస్తుతం నేను ఫ్రూట్స్, పప్పులు లాంటివి మాత్రమే తీసుకుంటున్నా. అంటే నా షుగర్ లెవల్స్ కు సరిపడ మాత్రమే తీసుకుంటున్నా. నాకు మరింత ఎనర్జీ వచ్చిందని భావిస్తున్నా అని చెప్పాడు హ్యూగో.

……………………………………….. : కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. పెరగనున్న ధరలు

మరోవైపు రోస్.. జిమ్ పర్‌ఫార్మెన్స్ అంతకుమించిపోయేలా ఉందట. కొన్ని రోజులు బాగా ఎనర్జిటిక్ గా ఉండేదట. వాటిని సమం చేసుకోవడానికి నిత్యం పోరాడేవాడట. దాంతో అతని మలమూత్రాల్లో కూడా బ్యాక్టీరియా శాతం సోదరుడిలాగే మారిందట.

కాకపోతే హ్యూగో వెజిటేరియన్ మీల్స్ తో పోలిస్తే.. తాను తింటున్నది బాగా ప్రోసెస్‌డ్ ఫుడ్ అని గ్రహించానంటున్నాడు రాస్.

12వారాల తర్వాత ఇద్దరిలో పెద్ద తేడాలు ఏమున్నాయా.. అని జరిపిన పరీక్షల్లో ఈ తేడాలు గమనించారట. హ్యూగో కొలెస్ట్రాల్ లెవల్స్ పూర్తిగా పడిపోవడం, బరువు బాగా తగ్గడం, టైప్ టూ డయాబెటిస్ ను నియంత్రించగలగడం లాంటి తేడాలు కనిపించాయట.

…………………………………. : వామ్మో ఒమిక్రాన్, ఆ రాష్ట్రంలో 7 కేసులు