YSR Kadapa: మఠం ఎపిసోడ్‌లో ట్విస్ట్.. పీఠాధిపతులపై పోలీస్ కంప్లైంట్!

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎపిసోడ్ లో కీలక టర్న్ తీసుకుంది. పీఠాధిపతులపై బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి చిన్న భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోలీసు శాఖకు ఫిర్యాదు చేశారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో వచ్చిన పీఠాధిపతులు ప్రభుత్వం నియమించింది కాదని..

YSR Kadapa: మఠం ఎపిసోడ్‌లో ట్విస్ట్.. పీఠాధిపతులపై పోలీస్ కంప్లైంట్!

Brahmamgari Matam

YSR Kadapa: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎపిసోడ్ లో కీలక టర్న్ తీసుకుంది. పీఠాధిపతులపై బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి చిన్న భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోలీసు శాఖకు ఫిర్యాదు చేశారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో వచ్చిన పీఠాధిపతులు ప్రభుత్వం నియమించింది కాదని.. తనను తన కుమారులను మభ్యపెట్టి బలవంతంగా చర్చలకు పిలిపించారని మహాలక్షమ్మ ఆరోపించారు.

చర్చలకు వచ్చిన వారు అధికారికంగా వచ్చిన పీఠాధిపతులు కాదని తెలుసుకుని మధ్యలోనే తాను చర్చల నుండి వెను తిరిగామని.. కుట్రపూరితంగా పీఠాధిపతి నియమించాలని నేడు మళ్లీ పీఠాధిపతులు వస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్ర పూరితంగా వెంకటాద్రి స్వామి పీఠాధిపతి చేస్తున్నట్లు తన దగ్గర ఆడియో టేప్ ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఎవరనే అంశంపై తమకంటే… తమకంటూ కుటుంబ సభ్యుల మధ్య గొడవతో ఇప్పటికే 12 మంది తెలుగు రాష్ట్రాల్లో మఠాధిపతులు పీఠముడి విప్పే ప్రయత్నం చేయగా తాజాగా మరోసారి 20 మంది పీఠాధిపతులు మఠానికి రానున్నారు. నేడు (జూన్ 12) శివస్వామి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి 20 మంది మఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి రానున్నారు.

శనివారం రాత్రి ఎనిమిది గంటలకు బ్రహ్మంగారి మఠంకు చేరుకొనున్న పీఠాధిపతులు రాత్రికి వాసవి కన్యకా పరమేశ్వరి గృహంలో విడిది చేసి ఆదివారం ఉదయం 10 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సందర్శన అనంతరం తిరిగి బ్రహ్మంగారిమఠం పయనం కానున్నారు. మఠం పీఠాధిపతి అంశంపై మరోసారి చర్చలు జరపనున్నారు. కానీ ఇంతలోనే పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి చిన్న భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోలీసు శాఖకు ఫిర్యాదు చేశారు.