Twitter Blue Subscription : మస్క్ మామూలోడు కాదుగా.. ట్విట్టర్ యూజర్లకు షాక్.. బ్లూ సబ్‌స్ర్కిప్షన్ ఫీచర్ మాయం.. ఇకపై బ్లూ టిక్ పొందలేరు!

Twitter Blue Subscription : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ట్విట్టర్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ (Twitter Blue subscription) ఫీచర్ మాయమైంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు.

Twitter Blue Subscription : మస్క్ మామూలోడు కాదుగా.. ట్విట్టర్ యూజర్లకు షాక్.. బ్లూ సబ్‌స్ర్కిప్షన్ ఫీచర్ మాయం.. ఇకపై బ్లూ టిక్ పొందలేరు!

Twitter Blue subscription no longer available, users can’t buy Blue Tick anymore

Twitter Blue Subscription : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ట్విట్టర్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ (Twitter Blue subscription) ఫీచర్ మాయమైంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇకపై ఉచితం కాదంటూ మస్క్ బాంబు పేల్చాడు. 8 డాలర్లకు పెయిడ్ బ్లూటిక్‭ వెరిఫికేషన్ తప్పనిసరి చేశాడు. నెలవారీ చార్జీ రూ. 719 కనిపించడం విశేషం. బ్లూటిక్ ఉన్న యూజర్లు నెలనెలా డబ్బులు చెల్లించాల్సిందే.

ఒకవేళ డబ్బు చెల్లించలేనప్పుడు బ్లూటిక్ ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. అయితే ట్విట్టర్ పెయిడ్ సబ్‌స్ర్కిప్షన్‌పై భారీ ఎత్తున విమర్శలు రావడంతో మస్క్ కంపెనీ వెనక్కి తగ్గింది. గడిచి 24 గంటలు గడవకముందే మళ్లీ పెయిడ్ బ్లూటిక్ వెరిఫికేషన్‭ను రీస్టోర్ చేసింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి అసలుకే బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించినట్టు కనిపిస్తోంది.

Twitter Blue subscription no longer available, users can’t buy Blue Tick anymore

Twitter Blue subscription no longer available, users can’t buy Blue Tick anymore

ట్విట్టర్ బ్లూ కోసం సైన్ అప్ చేసే ఆప్షన్ ఇకపై వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదని కొంతమంది యూజర్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో నివేదించారు. ప్రస్తుతం విభిన్న ఫీచర్లను రిలీజ్ చేస్తూ.. ఆపై వాటిని తొలగిస్తూ ట్విట్టర్ చాలా గందరగోళాన్ని సృష్టిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయింది. ట్విట్టర్ iOS యూజర్లకు మాత్రమే బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్ లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇంకా దీన్ని పొందలేదు. ఉదయం నుంచి సబ్‌స్ర్కిప్షన్ తొలగింపుపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవరైనా సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్‌అప్ చేయడానికి ప్రయత్నిస్తే, యాప్ ‘Thank you for your interest ట్విట్టర్ బ్లూ భవిష్యత్తులో మీ దేశంలో అందుబాటులో ఉంటుంది. దయచేసి తర్వాత తిరిగి చెక్ చేయండి’ అంటూ మెసేజ్ కనిపిస్తోంది.

రివర్స్ ఇంజనీర్ జేన్ మంచున్ వాంగ్ (Jane Manchun Wong) కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో నివేదించారు. బ్లూ టిక్ సబ్ స్ర్కిప్షన్ కోసం Sign Up చేయాలంటే API యాప్‌లో కొనుగోలు ఫీచర్ తొలగించినట్టు కనుగొన్నారు. యూజర్లు గత iOS యాప్‌లోని సైడ్‌బార్ సెక్షన్ నుంచి ఈ ఫీచర్‌కు మెంబర్‌షిప్ పొందారు. ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్ నుంచి బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ఎందుకు తొలగించింది అనేది ప్రస్తుతానికి తెలియదు. ట్విట్టర్ ప్లాట్ ఫారంపై నిండిపోయిన బోగస్ అకౌంట్లకు అడ్డుకట్ట వేయాలని కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Twitter Blue subscription no longer available, users can’t buy Blue Tick anymore

Twitter Blue subscription no longer available, users can’t buy Blue Tick anymore

ట్విట్టర్ బ్లూ సబ్ స్ర్కిప్షన్ ప్రకటించినప్పటి నుంచి అనేక సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. యూజర్లు Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అందులో హై ప్రొఫైల్ యూజర్లు ఫేక్ వెరిఫైడ్ అకౌంట్లను ఎక్కువగా క్రియేట్ చేశారు. దాంతో ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో చాలా గందరగోళాన్ని సృష్టించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్ తొలగించి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Blue: దేశంలో మొదలైన ట్విట్టర్ బ్లూ సర్వీస్.. వాళ్లకు మాత్రమే అందుబాటులోకి.. నెలకు ఎంత చెల్లించాలంటే