MS Dhoni: అడవులు కాపాడాలని ధోనీ సందేశం.. నెటిజన్లు ట్రోలింగ్!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పర్యావరణ సంరక్షణ కోసం పిలుపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా అనంతరం ఆక్సిజన్ విలువ తెలిసొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని.. ఉన్నవాటిని కాపాడుకోవాలని కోరుతున్నారు. టీం ఇండియా మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అలాంటి సందేశమే ఇచ్చాడు. చెట్లను నాటి కాపాడాలని అభిమానులను, నెటిజన్లను కోరాడు.

MS Dhoni: అడవులు కాపాడాలని ధోనీ సందేశం.. నెటిజన్లు ట్రోలింగ్!

Ms Dhoni (1)

MS Dhoni: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పర్యావరణ సంరక్షణ కోసం పిలుపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా అనంతరం ఆక్సిజన్ విలువ తెలిసొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని.. ఉన్నవాటిని కాపాడుకోవాలని కోరుతున్నారు. టీం ఇండియా మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అలాంటి సందేశమే ఇచ్చాడు. చెట్లను నాటి కాపాడాలని అభిమానులను, నెటిజన్లను కోరాడు. కానీ నెటిజన్లు ధోనీని ఘోరంగా ట్రోల్ చేస్తూ మెసేజీలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఎందుకు ట్రోల్ చేస్తున్నారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ధోనీ ప్రస్తుతం కుటుంబంతో సహా సిమ్లాలో గడుపుతుండగా అక్కడే తనకు ఓ వుడెన్‌ హౌస్‌ కూడా ఉంది. దీనికి సంబంధించిన ఒక గదిని తాజాగా చెక్కలతో నిర్మిస్తున్నాడు. సిమ్లా ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కలతోనే నిర్మిస్తారు. ధోనీ కూడా అదే పద్ధతిలో చెక్కతోనే గదిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు ధోనీ షేర్ చేస్తూ ఒక చోట చెక్క మీదనే చెట్లను నాటి వాటిని కాపాడాలని కోరాడు.

అయితే, ధోనీ ఇచ్చిన సందేశంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. నిర్మించే ఆ గది కోసం నువ్వు ఎన్ని చెట్లను నరికావో చెప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. చెక్కపై చెట్లు నాటండి అని రాయడం మంచి ఆలోచన ఎలా అవుతుందని మండిపడుతున్నారు.