Twitter: ‘బైబై స‌ర్’ అంటూ అతి చిన్న రాజీనామా లేఖ.. ట్విటర్‌లో ఫొటో వైరల్

చేస్తోన్న ఉద్యోగం న‌చ్చ‌క‌పోతే రాజీనామా చేసేసి, మ‌రో ఉద్యోగాన్ని వెతుక్కోవ‌డ‌మే మేల‌ని చాలా మంది సూచిస్తుంటారు. రాజీనామా చేసే స‌మ‌యంలో త‌మ కోపాన్ని ఆ లేఖలో క‌న‌ప‌డేలా రాస్తారు కొంద‌రు.

Twitter: ‘బైబై స‌ర్’ అంటూ అతి చిన్న రాజీనామా లేఖ.. ట్విటర్‌లో ఫొటో వైరల్

Resign

Twitter: చేస్తోన్న ఉద్యోగం న‌చ్చ‌క‌పోతే రాజీనామా చేసేసి, మ‌రో ఉద్యోగాన్ని వెతుక్కోవ‌డ‌మే మేల‌ని చాలా మంది సూచిస్తుంటారు. రాజీనామా చేసే స‌మ‌యంలో త‌మ కోపాన్ని ఆ లేఖలో క‌న‌ప‌డేలా రాస్తారు కొంద‌రు. అస‌లు రాజీనామా లేఖ రాయాలంటే దానిపై ”టు ది హెచ్ఆర్” అని పేర్కొన‌డంతో పాటు తేదీ, పేరు, సంస్థ పేరు, రాజీనామా చేసేందుకు కార‌ణం, రాజీనామా అనంత‌రం వేత‌నంతో పాటు త‌మ‌కు సంస్థ నుంచి అందాల్సిన ఇత‌ర ప్ర‌యోజ‌నాలు వంటివ‌న్నీ ప్ర‌స్తావిస్తుంటాం. అయితే, ఓ ఉద్యోగి మాత్రం ఇవి ఏవీ రాయకుండా అతి చిన్న రాజీనామా లేఖ రాశారు.  అందులో ”బై బై స‌ర్” అనే అంశ‌మే బాడీగా ఉంది.

congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

”డియ‌ర్ సర్.. రాజీనామా.. బైబై స‌ర్” అంటూ రాసి దానిపై సంత‌కం చేశారు ఓ ఉద్యోగి. ఇంత విచిత్రంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగి ఎవ‌రో తెలియ‌దు కానీ, ఇందుకు సంబంధించిన ఫొటో మాత్రం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇటువంటి రాజీనామా లేఖ రాసిన ఉద్యోగి తీరు గురించి నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగం న‌చ్చ‌క‌పోతే ఇలా కూడా చేస్తారా? అంటూ కొంద‌రు చుర‌క‌లు అంటిస్తున్నారు. మ‌ఫంగ ఎం బుసో పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో మొద‌ట ఈ రాజీనామా లేఖ‌కు సంబంధించిన ఫొటో క‌న‌ప‌డింది.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

అది చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో నెటిజ‌న్లు షేర్ చేస్తున్నారు. ఇంత సింపుల్‌గా రాజీనామా చేయ‌డం నీకే సాధ్య‌మైందని పేర్కొంటున్నారు. రాజీనామా లేఖల‌న్నీ ఇలాగే చాలా సుల‌భంగా ఉండాల‌ని, పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తూ రాజీనామా చేయ‌డం ఎందుక‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో నేర్చుకోవాల‌ని చాలా కాలంగా అనుకుంటున్నాన‌ని, ఇంత సింపుల్‌గా ఉంటుంద‌ని ఇప్పుడే తెలిసింద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నారు.