Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

ట్విట్టర్ బ్లూ చెక్‌మార్క్‌కు సంబంధించి ఖాతాలను రీవెరిఫికేషన్ చేయనున్నారు. మరోసారి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత బ్లూ టిక్ కేటాయిస్తారు. అలాగే ఈసారి వేర్వేరు కలర్స్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

Twitter: ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత నుంచి కంపెనీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇక యాప్ వాడకం విషయంలో కూడా అనేక మార్పులు చేస్తున్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్ పొందే యూజర్ల దగ్గరి నుంచి ప్రతి నెలా ఛార్జి వసూలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

YS Sharmila Arrest: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్‌ నగర్ పీఎస్ వద్ద హైటెన్షన్..

తాజాగా బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం కొత్త పద్ధతి తీసుకొస్తున్నాడు. యూజర్ల బ్లూ చెక్‌మార్క్‌ను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని ప్రకారం.. ఇప్పటికే బ్లూ చెక్‌మార్క్ పొందిన యూజర్లు మరోసారి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎవరైనా బ్లూ చెక్‌మార్క్ పొందేందుకు అర్హులు కాదని భావిస్తే.. వారి అకౌంట్ ప్రొఫైల్ నుంచి బ్లూటిక్ మార్క్ తొలగిస్తారు. కొత్త బ్లూ టిక్ రీలాంఛ్ ఫీచర్ ప్రారంభించడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మస్క్ భావిస్తున్నాడు. డిసెంబర్ 2 నుంచి బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఇది పూర్తైన తర్వాత నుంచి కొత్త బ్లూటిక్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Covid Vaccine Deaths : కొవిడ్‌ వ్యాక్సిన్ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దీనికోసం యూజర్లు నెలనెలా ఛార్జీలు చెల్లించాలి. అలాగే కొత్త చెక్‌మార్క్‌కు బ్లూ కలర్ ఒక్కటే కాకుండా… వేరువేరు కలర్స్ వాడే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. గోల్డ్ కలర్ ప్రైవేటు సంస్థలకు, గ్రే కలర్ ప్రభుత్వ సంస్థలకు, బ్లూ కలర్ వ్యక్తులకు ఇవ్వాలని ట్విట్టర్ భావిస్తోంది.