Rape Attempt: పశువుల కాపరిగా పదేళ్ల బాలిక.. కన్నేసిన ఇద్దరు కామాంధులు!

పద్నాలుగేళ్ల లోపు పిల్లలను పనికి పంపడం నేరం. కానీ ఆ పదేళ్ల బాలిక పశువుల కాపరిగా మారింది. రోజుమాదిరిగా పొలానికి పశువులను తోలుకెళ్లిన ఆ బాలికపై ఓ ఇద్దరు మృగాళ్ల కన్ను పడింది.

Rape Attempt: పశువుల కాపరిగా పదేళ్ల బాలిక.. కన్నేసిన ఇద్దరు కామాంధులు!

Rape Attempt

Rape Attempt: పద్నాలుగేళ్ల లోపు పిల్లలను పనికి పంపడం నేరం. కానీ ఆ పదేళ్ల బాలిక పశువుల కాపరిగా మారింది. రోజుమాదిరిగా పొలానికి పశువులను తోలుకెళ్లిన ఆ బాలికపై ఓ ఇద్దరు మృగాళ్ల కన్ను పడింది. రహదారికి కూతవేటు దూరంలోనే బాలిక కనిపించడంతో రోడ్డు మీద వాహనాన్ని నిలిపి ఆమెని చేరుకొని ఇద్దరూ కలిసి పొదల్లోకి లాక్కెళ్లారు. బాలిక భయంతో కేకలు వేయడంతో అటుగా రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి ఆమెను రక్షించారు.

Rape Attempt

Rape Attempt

వివరాల్లోకెళ్తే గుంటూరు జిల్లా చేబ్రోలు మండల హెడ్ క్వార్ట్రర్ నుండి నుంచి మంచాల గ్రామం వైపుగా వెళ్లే రహదారికి దగ్గరలో ఓ పదేళ్ల బాలిక పశువులను మేపుకుంటుంది. ఓ వంతెన అక్కడకి దగ్గరగా ఉండగా ఇద్దరు యువకులు ఫుల్లుగా అక్కడే మద్యం తాగి పదేళ్ల బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. వారి చర్యలతో భయపడిన బాలిక కేకలు వేయడంతో అటుగా వెళ్లే కొందరు వ్యక్తులు గమనించి బాలికను రక్షించారు.

Rape Attempt

Rape Attempt

బాలికను రక్షించిన వారికి తోడు మరికొందరు కలిసి ఆ ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాదారు. తగిన దేహశుద్ధి చేసిన అనంతరం చేబ్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరు యువకులతో పాటు బాలికను చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. కాగా.. ఆ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఆ ఇద్దరు యువకులు ఎవరన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.