Joe Biden : జో బిడెన్ ప్రభుత్వంలో ఇద్దరు ఇండో అమెరికన్లకు కీలక పదవులు

వెస్ట్ వర్జీనియా మాజీ హెల్గ్ కమీషనర్ డాక్టర్ రాహుల్ గుప్తాను ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. ప్రముఖ సర్జన్ , రచయిత కూడా అయితన అతుల్ గవాండేను అమెరికన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లో బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంటె అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు.

Joe Biden : జో బిడెన్ ప్రభుత్వంలో ఇద్దరు ఇండో అమెరికన్లకు కీలక పదవులు

ఇండో అమెరికన్లకు కీలక పదవులు

Joe Biden : ఇండియాలో పుట్టి అమెరికాకు వెళ్ళి అక్కడే స్ధిరపడిపోయిన ఇండియన్స్ ప్రస్తుతం అమెరికాలో చక్రం తిప్పుతున్నారు. అక్కడి పాలన వ్యవహారాల్లో కీలక బాధ్యతలతో తమ సత్తా చాటుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వాలు ఇండియన్స్ సామర్ధ్యాన్ని గుర్తించి కీలక పదవుల్లో అగ్ర తాబూలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఇద్దరు ఇండో అమెరికన్ లకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక పదవులు అప్పగించారు. ప్రభుత్వ యంత్రాగంలోని కీలక బాధ్యతల్లో ఇద్దరు ఇండో అమెరికన్ వైద్యుల్ని నియమిస్తూ అదేశాలు జారి చేయటం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తించింది.

వెస్ట్ వర్జీనియా మాజీ హెల్గ్ కమీషనర్ డాక్టర్ రాహుల్ గుప్తాను ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. ప్రముఖ సర్జన్ , రచయిత అతుల్ గవాండేను అమెరికన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లో బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంటె అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. రాహుల్ గుప్తా  హెల్త్ కమీషనర్ గా ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ ప్రజారోగ్య పాలసీలపై అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. ఇండియాలో పుట్టిన ఆయన అమెరికాలో పెరిగి అక్కడే స్ధిరపడిపోయారు.

ఇక అతుల్ గవాండే విషయానికి వస్తే గవాండే అమెరికాలో ప్రముఖ వైద్యునిగా పేరు సంపాదించారు. ఆయన రాసిన పలు పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ద చెక్ లిస్ట్ మేనిఫెస్టో, బీయింగ్ మోర్టల్, కాంప్లికేషన్స్ వంటి పుస్తకాలు చాలా పాపులర్ అయ్యాయి. ఇండియన్స్ పనితీరుపై జో బిడెన్ కు మంచి అభిప్రాయం ఉండటంతోనే ఈ తరహా చర్యలు ఆయన చేపడుతున్నట్లు ఇండో అమెరికన్లు చెబుతున్నారు. అమెరికా పాలనా విభాగాల్లో ఇండియన్స్ కు కీలక పదవులు లభించటం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.