Pennsylvania: చాక్లెట్ ట్యాంకులో పడిపోయిన ఇద్ద‌రు వ్య‌క్తులు

నీటి ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకుల్లో పడిపోయి ప్రాణాల మీద‌కు తెచ్చుకునే వారి గురించి వింటూనే ఉంటాం. అయితే, అమెరికాలోని పెన్సిల్వేనియాలో చాక్లెట్‌తో నిండిపోయిన ట్యాంకులో ప‌డ్డారు ఇద్ద‌రు వ్య‌క్తులు.

Pennsylvania: చాక్లెట్ ట్యాంకులో పడిపోయిన ఇద్ద‌రు వ్య‌క్తులు

Van2

Pennsylvania: నీటి ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకుల్లో పడిపోయి ప్రాణాల మీద‌కు తెచ్చుకునే వారి గురించి వింటూనే ఉంటాం. అయితే, అమెరికాలోని పెన్సిల్వేనియాలో చాక్లెట్‌తో నిండిపోయిన ట్యాంకులో ప‌డ్డారు ఇద్ద‌రు వ్య‌క్తులు. చివ‌ర‌కు వారిని ఆ ట్యాంకు నుంచి బ‌య‌ట‌కు తీయ‌డంతో వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. మార్స్ ఎం అండ్ ఎం ఫ్యాక్ట‌రీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పెన్సిల్వేనియా అధికారులు మీడియాకు తెలిపారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

వారు ట్యాంకులో ఉన్న విష‌యాన్ని గుర్తించిన ఫ్యాక్ట‌రీ సిబ్బంది వెంట‌నే వారికి బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిపారు. అందుకోసం ఆ చాక్లెట్‌ ట్యాంకుకు రంధ్రం చేయాల్సి వ‌చ్చిందని అధికారులు చెప్పారు. వారిని ట్యాంకు నుంచి బ‌య‌టకు లాగిన వెంట‌నే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించామ‌ని తెలిపారు. ఒక‌రిని అంబులెన్సులో, మ‌రొక‌రిని హెలికాప్ట‌ర్ ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వివ‌రించారు. ఆ ఇద్ద‌రు చాక్లెట్ ట్యాంకులో ఎలా ప‌డ్డార‌న్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేద‌ని తెలిపారు.