Transgender doctors: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చరిత్ర లిఖించిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు

తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చరిత్ర లిఖించారు. వ్యక్తిగత జీవితంలో ఉండే అన్ని సవాళ్లను అధిగమించి వైద్య విద్య పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్, రుత్ జాన్ పాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్యాధికారులుగా చేరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ ఇంటర్వ్యూలో రాథోడ్ మాట్లాడారు. ‘‘నా టీనేజ్ లో తోటి విద్యార్థులతో అనేక వేధింపులు ఎదురయ్యాయి’’ అని రాథోడ్ చెప్పారు.

Transgender doctors: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చరిత్ర లిఖించిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు

Transgender doctors

Transgender doctors: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చరిత్ర లిఖించారు. వ్యక్తిగత జీవితంలో ఉండే అన్ని సవాళ్లను అధిగమించి వైద్య విద్య పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్, రుత్ జాన్ పాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్యాధికారులుగా చేరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ ఇంటర్వ్యూలో రాథోడ్ మాట్లాడారు.

‘‘జీవితంలో ఎన్నో సాధించినప్పటికీ వివక్ష మాత్రం పోదు. నా చిన్నప్పటి నుంచి నేను వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నాను. గతంలో నేను ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లు వైద్యురాలిగా పనిచేశాను. కానీ, అనంతరం ఆ ఆసుపత్రి నుంచి నన్ను తొలిగించారు. నేను పనిని కొనసాగిస్తే ఆసుపత్రికి రోగులు రాకపోవచ్చని భావించి చివరకు అలా చేశారు’’ అని ప్రాచీ రాథోడ్ చెప్పారు.

ఆమె 2015లో ఆదిలాబాద్ లోని ఓ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తాను పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీకి వెళ్లానని, కానీ, అక్కడ తనకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేశానని చెప్పారు. హైదరాబాద్ కు వచ్చాక ఓ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా పూర్తి చేశానని అన్నారు.

‘‘నా టీనేజ్ లో తోటి విద్యార్థులతో అనేక వేధింపులు ఎదురయ్యాయి. ఇలాంటి వాటినన్నింటినీ ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని బాధపడేదాన్ని. ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి. మమ్మల్ని థర్డ్ జెండర్ అని అంటున్నారు. నేను ప్రభుత్వాన్ని, మమ్మల్ని కించపర్చేవారిని నేను ఓ ప్రశ్న అడుగుతున్నాను. ఫస్ట్ జెండర్ ఎవరు? సెకండ్ జెండర్ ఎవరు?’’ అని రాథోడ్ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..