Uddhav Thackeray: ద్రౌపది ముర్ముకు ఉద్ధవ్ థాక్రే మద్దతు?

చాలా మంది ఎంపీలు మాత్రం ఇంకా ఉద్ధవ్‌పై నమ్మకంతో, ఆయన వైపే ఉన్నారు. కాగా, ఎంపీలు కూడా షిండే వర్గంలో చేరిపోతారనే ప్రచారం జరిగినా, వారు షిండే వైపు వెళ్లలేదు. షిండే వైపు చేరిన శివసేన వర్గం బీజేపీకి మద్దతు ప్రకటించింది.

Uddhav Thackeray: ద్రౌపది ముర్ముకు ఉద్ధవ్ థాక్రే మద్దతు?
ad

Uddhav Thackeray: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే మద్దతిచ్చే అవకాశాలున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలో పొత్తులో ఉన్న ఉద్ధవ్ కేంద్రంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. అయితే, అందుకు పరిస్థితులు సహకరించేలా లేవు. ఇప్పటికే శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి చేరిపోయిన సంగతి తెలిసిందే.

Cute Charge: ‘క్యూట్ చార్జి’ వసూలు చేస్తున్న ఇండిగో.. నెటిజన్ల జోకులు

కానీ, చాలా మంది ఎంపీలు మాత్రం ఇంకా ఉద్ధవ్‌పై నమ్మకంతో, ఆయన వైపే ఉన్నారు. కాగా, ఎంపీలు కూడా షిండే వర్గంలో చేరిపోతారనే ప్రచారం జరిగినా, వారు షిండే వైపు వెళ్లలేదు. షిండే వైపు చేరిన శివసేన వర్గం బీజేపీకి మద్దతు ప్రకటించింది. దీంతో ఉద్ధవ్ వైపు ఉన్న శివసేన ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దుతిస్తారా.. లేక ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తారా అనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక ఉద్ధవ్‌కు సవాలుగా మారింది. చాలా మంది శివసేన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది నిజానికి ఉద్ధవ్ ఆలోచనకు వ్యతిరేకమే. ఎందుకంటే ఆయన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

Crocodile: నదిలో స్నానానికి వెళ్లిన బాలుడు.. మింగేసిన మొసలి

ఈ పరిస్థితుల్లో సోమవారం పార్టీ ఎంపీలు ఉద్ధవ్ థాక్రేను కలిశారు. తాము పార్టీ తరఫున ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలనుకుంటున్న విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై ఉద్ధవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎంపీలు కోరుకుంటున్నట్లుగా ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలా.. లేక తన నిర్ణయం ప్రకారం యశ్వంత్‌కు మద్దతు ఇవ్వాలా అనే సందిగ్ధంలో ఉద్ధవ్ ఉన్నారు. ఒకవేళ తను ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోయినా, ఎంపీలు మాత్రం అటువైపే ఓటు వేస్తారు. దీంతో ఎంపీలు కూడా తన మాట వినని పరిస్థితి తలెత్తినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే తన పార్టీ ఎంపీలు కోరినట్లుగానే ఆయన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి.

Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

ఇప్పటికే పార్టీలోని గిరిజన నేతలు కూడా ఈ విషయంపై గతంలోనే ఉద్ధవ్‍‌ను కలిసి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఉద్ధవ్ థాక్రే ఎంపీల నిర్ణయానికే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్రంలోని ప్రతిపక్షాలకు గట్టి షాక్ తగిలినట్లే. కాగా, సోమవారం ఉద్ధవ్ థాక్రేతో జరిగిన ఎంపీల సమావేశానికి 13 మంది శివసేన ఎంపీలు హాజరయ్యారు. మరో ఐదుగురు ఎంపీలు గైర్హాజరయ్యారు.