Uddhav Thackeray: తగ్గుతున్న ఉద్ధవ్ బలం.. పై చేయి సాధిస్తున్న షిండే

కొడుకు ఆదిత్య థాక్రేతోపాటు, సుభాష్ దేశాయ్ మాత్రమే మంత్రివర్గం నుంచి ఉద్ధవ్ వెంట ఉన్నారు. షిండే వైపు తొమ్మిది మంది మంత్రులు, ఉద్ధవ్ వైపు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండటంతో షిండే పై చేయి సాధించినట్లవుతోంది.

Uddhav Thackeray: తగ్గుతున్న ఉద్ధవ్ బలం.. పై చేయి సాధిస్తున్న షిండే

Uddhav Thackeray (1)

Uddhav Thackeray: మహారాష్ట్రలో ఉద్ధవ్ వర్సెస్ షిండేగా సాగుతున్న రాజకీయ పోరులో ప్రస్తుతానికి షిండేదే పై చేయిగా కనిపిస్తోంది. ఉద్ధవ్ మంత్రివర్గంలోని తొమ్మిది మంది శివసేన మంత్రులు షిండే వర్గంలో చేరిపోయారు. షిండే క్యాంపులో మంత్రులు గులాబ్‌రావ్ పాటిల్, శంబురాజే దేశాయ్, దాదా భూసే, ఉదయ్ సమంత్, అబ్దుల్ సత్తార్, సందీపన్‌ రావ్ భూమారే, రాజేంద్ర యాదవ్‌ కర్, బచ్చు కడు ఉన్నారు. ఉద్ధవ్‌కు ఇద్దరు మంత్రులు మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. కొడుకు ఆదిత్య థాక్రేతోపాటు, సుభాష్ దేశాయ్ మాత్రమే మంత్రివర్గం నుంచి ఉద్ధవ్ వెంట ఉన్నారు. షిండే వైపు తొమ్మిది మంది మంత్రులు, ఉద్ధవ్ వైపు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండటంతో షిండే పై చేయి సాధించినట్లవుతోంది.

Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ

దీంతో క్రమంగా ఉద్ధవ్ బలం తగ్గుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే చర్యలు చేపట్టారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముంబైలోని గోవండిలో శివసైనికులను ఉద్దేశించి ఉద్ధవ్ ప్రసంగిస్తారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై వచ్చే తీర్పు.. మహారాష్ట్ర తాజా రాజకీయ సంక్షోభంపై ఒక స్పష్టత వచ్చేలా చేస్తుంది. నేటి విచారణతో ఉద్ధవ్, షిండేల భవితవ్యం తేలే అవకాశం ఉంది.