పేదలకు నెలకు రూ. 6వేలు, గృహిణులకు రూ.2వేలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో!

పేదలకు నెలకు రూ. 6వేలు, గృహిణులకు రూ.2వేలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో!

Udf Leaders Release The Partys Manifesto For Kerala Assembly Elections1

కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు ప్రతిపాదనలు ఆసక్తికరంగా.. కొత్తగా ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ‘ఆనందమయ శాఖ’ (మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్)ను ఏర్పాటు చేస్తామనే హామీ ఇందులో ఆసక్తికరంగా ఉండగా.. అధికారంలోకి వస్తే 40-60 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు అందిస్తామని హామీ ఇచ్చింది.

అలాగే నిరాశ్రయులైన కుటుంబాలకు నెలవారీ ఆదాయం 6,000 రూపాయలు కచ్చితంగా వచ్చేలా.. మరియూ నెలవారి పెన్షన్లను రూ. 3వేలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది కాంగ్రెస్.. పెట్టుబడిదారుల పరిరక్షణ చట్టం తీసుకు వస్తామని హామీ ఇచ్చింది. వ్యాపారాలకు భరోసా ఇవ్వడంతో పాటు సమ్మెలు, బలవంతంగా వ్యాపారాల మూసివేయడంపై నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

గృహిణులకు పింఛన్‌, ఉచిత గృహాలు.. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఐదు లక్షల ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రానున్నట్లు యూడీఎఫ్‌ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాయబోయే తల్లులకు రెండేళ్లు వయోపరిమితి పెంచనున్నట్లు హామీ ఇచ్చింది.