Sri Lanka: శ్రీలంకలో హింస.. ఆ దేశానికి వెళ్ళొద్దు: త‌మ పౌరుల‌కు యూకే, న్యూజిలాండ్ సూచ‌న‌

తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీ‌లంక‌లో ప్ర‌స్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొర‌క‌డం గ‌గ‌న‌మైపోయింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశానికి వెళ్ళ‌కుండా ప‌లు దేశాలు త‌మ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. తాజాగా, యూకే, న్యూజిలాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి.

Sri Lanka: శ్రీలంకలో హింస.. ఆ దేశానికి వెళ్ళొద్దు: త‌మ పౌరుల‌కు యూకే, న్యూజిలాండ్ సూచ‌న‌

Curfew In Sri Lanka (1)

Sri Lanka: తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీ‌లంక‌లో ప్ర‌స్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొర‌క‌డం గ‌గ‌న‌మైపోయింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశానికి వెళ్ళ‌కుండా ప‌లు దేశాలు త‌మ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. తాజాగా, యూకే, న్యూజిలాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. అత్య‌వ‌స‌రం లేనిదే శ్రీ‌లంక‌కు వెళ్ళ‌కూడ‌దని త‌మ పౌరుల‌కు ఆ రెండు దేశాలు సూచించాయి. యూకే విదేశాంగ శాఖ కార్యాల‌యం తాజాగా త‌మ పౌరుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద భారీగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీరు

”వెళ్ళ‌కూడ‌ని దేశాల జాబితాలో శ్రీ‌లంక‌కు చేర్చాం. శ్రీ‌లంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  ఆ దేశంలో ఔష‌ధాలు, వంగ గ్యాస్, ఇంధ‌న, ఆహార కొరత ఉంది. పెట్రోలు, డీజిల్ కొర‌త ప్ర‌భావం ర‌వాణా, వ్యాపార‌, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌పై ప‌డింది. శ్రీ‌లంక‌లో ప్ర‌తిరోజు విద్యుత్ కోత‌లు ఉంటున్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ర‌హ‌దారుల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు కూడా చేస్తున్నారు. హింస కూడా చెల‌రేగుతోంది” అని యూకే పేర్కొంది. న్యూజిలాండ్ కూడా ఇటువంటి ప్ర‌క‌ట‌నే విడుద‌ల చేసి, శ్రీ‌లంక‌కు అత్య‌వ‌స‌రం అయితే మాత్ర‌మే వెళ్ళాల‌ని సూచించింది. శ్రీ‌లంక‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్పింది. దీంతో చాలా మంది చ‌నిపోతున్నార‌ని, గాయాల‌తో ఆసుప‌త్రుల పాలు అవుతున్నార‌ని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళ‌పై దాడి చేసి, వాటిని త‌గుల బెడుతున్నార‌ని చెప్పింది.