Ukku Satyagraham : మే డే సందర్భంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పాట రిలీజ్ చేసిన గద్దర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో సినిమా..

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో...’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేయడం విశేషం..

Ukku Satyagraham : మే డే సందర్భంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పాట రిలీజ్ చేసిన గద్దర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో సినిమా..

Ukku Satyagraham

Ukku Satyagraham: విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో…’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేయడం విశేషం. ఈ పాటను ప్రధాన పాత్రధారి సత్యా రెడ్డి, ఇతర ఆర్టిస్టులతో పాటు గద్దర్ పై చిత్రీకరించారు.

Ukku Satyagraham

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యా రెడ్డి ఇప్పటివరకు ‘ప్రత్యూష’, ‘సర్దార్ చిన్నపరెడ్డి’, ‘రంగుల కళ’, ‘కుర్రకారు’, ‘అయ్యప్ప దీక్ష’, ‘గ్లామర్’, ‘సిద్ధం’, ‘ప్రశ్నిస్తా’ వంటి 42 చిత్రాలు నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్న సత్యా రెడ్డి జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సత్యా రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవల వైజాగ్ పరిసరాల్లో జరిగింది.

Ukku Satyagraham

ఇందులో భాగంగా ఈ పాటను చిత్రీకరించామని దర్శక నిర్మాత, నటుడు సత్యా రెడ్డి తెలిపారు. రెండో షెడ్యూల్ కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు. ఇందులో పదమూడు నిమిషాల పాట మరో హైలైట్‌గా ఉంటుందని, దానిని కూడా గద్దర్ పాడటంతో పాటు ఆ పాటలో కూడా ఆయన నటించారని, అలాగే ఓ పాత్రలో కూడా ఆయన కనిపిస్తారని సత్యా రెడ్డి తెలిపారు.

Ukku Satyagraham

ఇంకా సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాశారని ఆయన వివరించారు. ప్రముఖ నటీనటులతో పాటు ఇంకా ఈ చిత్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు నటిస్తారని ఆయన తెలిపారు. ఓ మంచి ఉద్యమ చిత్రాన్ని ఉద్యమ కాలంలోనే తీస్తున్న సత్యా రెడ్డిని గద్దర్ అభినందించారు.

ఈ చిత్రానికి సంగీతం- శ్రీకోటి,
కెమెరా- వెంకట్,
నిర్మాణ సారధ్యం- పి. సతీష్ రెడ్డి
సహ నిర్మాతలు- సంఘం శంకర్ రెడ్డి, కుర్రి నారాయణరెడ్డి, శేషుబాబు యాదవ్.
రచనా సహకారం -శ్రీ వేముల
నిర్వహణ: పోలిశెట్టి వెంకట నాగు..