మంచుతో ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచేందుకు మహిళ తిప్పలు..వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 12:39 PM IST
మంచుతో ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచేందుకు మహిళ తిప్పలు..వీడియో వైరల్

Ukraine ice covering the street : మంచుతో ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచేందుకు ఓ మహిళ తిప్పలు పడింది. కనీసం నడవలేక..కుప్పకూలింది. ఒక అడుగు వేసి వెళుదామనే లోపలే…జారి కిందపడిపోతోంది. ఎన్నోమార్లు ప్రయత్నించినా..సఫలం కాలేకపోయింది. ఒకతను సహాయం ఇచ్చినా..ముందుకు వెళ్లలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె కష్టాలు చూసి..బాధగా ఉన్నా..నవ్వు ఆపలేకపోతున్నామని కొంతమంది నెటిజన్లు వెల్లడిస్తున్నారు.

ఉక్రేయిన్..లో భారీగా మంచు కురుస్తోంది. ఎంతలా అంటే..ఎక్కడా చూసిన మంచే కనిపిస్తోంది. వీధులన్నీ పూర్తిగా తడిగా మారిపోతున్నాయి. మంచును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే..ఓ వీధిలో మంచు కురవడంతో…రహదారి మొత్తం తడిగా మారిపోయింది. కొంతమంది జారుకుంటూ..పడుకుంటూ..వెళుతున్నారు. అలాగే..ఓ మహిళ ఫుట్ పాత్‌పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ..ముందుకు వెళ్లలేకపోయింది. ధబాల్న కింద పడడం..మళ్లీ ప్రయత్నం చేసింది. కానీ అడుగు ముందుకు వేయలేకపోయింది. అటువైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి అందించి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. అతని చేయి పట్టుకుని..కొద్ది దూరం వెళ్లినా..జర్రున జారుకుంటూ..వెనక్కి వెళ్లిపోయింది.

సహాయం కోసం ఎదురు చూడడం వీడియోలో కనిపించింది. చివరకు మొకాళ్ల మీద నడుచుకుంటూ వెళుదామని ట్రై చేసింది. అది వీలు కాలేదు. జారుకుంటూ..మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని..వేరే ప్రాంతం గుండా వెళుదామని వెళ్లింది. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉన్న ఈ వీడియో అక్కడ పడుతున్న ప్రజల కష్టాలను చూపెట్టింది. ఈమె పరిస్థితి 2020లాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.