Priyanka Gandhi: యువత బాధను అర్థం చేసుకోండి.. గతంలో నేను లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు..

ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న యువత బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మూడేళ్లుగా ఆర్మీలో రిక్రూట్‌మెంట్ జరగడం లేదని ఆమె తెలిపారు.

Priyanka Gandhi: యువత బాధను అర్థం చేసుకోండి.. గతంలో నేను లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు..

Priyanka Gandi

Priyanka Gandhi: ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిరసనకారులు రైళ్లకు నిప్పంటిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు. బీహార్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు ఉధ్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకొనేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్మీలో రిక్రూట్‌మెంట్ గురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాను చేసిన విజ్ఞప్తి వినలేదని అన్నారు. యువకుల డిమాండ్లపై దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ నేను ఈ ఏడాది మార్చి29న రక్షణ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం యువత గొంతుకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రియాంక ట్విటర్ లో పేర్కొన్నారు.

Priyanka Gandi (1)

ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న యువత బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మూడేళ్లుగా ఆర్మీలో రిక్రూట్‌మెంట్ జరగడం లేదని ఆమె తెలిపారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న గ్రామీణ యువకుల బాధను అర్థం చేసుకోండి, దేశవ్యాప్తంగా యువత కాళ్లకు బొబ్బలు వచ్చాయని, నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని ప్రియాంక గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఫలితాలు, నియామకాలు. ప్రభుత్వ శాశ్వత రిక్రూట్‌మెంట్, ర్యాంక్, పెన్షన్, అన్నిటినీ తీసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Basara IIT: ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన విరమించండి.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ..

ఇదిలాఉంటే ఆర్మీలో ఖాళీగా ఉన్నపోస్టుల భర్తీకి తక్షణమే రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలని, యువతకు వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మార్చి 29న రాసిన లేఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. రిక్రూట్‌మెంట్, ఫలితాలు, నియామకాల్లో సుదీర్ఘ జాప్యం కారణంగా యువతలో తీవ్ర నిరాశ నెలకొందని రక్షణ మంత్రికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.