UNESCO: హింస జరిగిన అత్యాచారాలపైనే భారతీయ మీడియా దృష్టి : యునెస్కో కీలక వ్యాఖ్యలు

అత్యాచార కేసుల్లో భారత మీడియా రిపోర్టింగ్‌పై యునెస్కో షాకింగ్​ నివేదిక విడుదల చేసింది. హింస ఎక్కువుండే కేసులమీదనే ఎక్కువగా భారత్ మీడియా దృషి పెడుతోందని వెల్లడించింది. ఈక్రమంలో భారత్ మీడియాకు యునెస్కో నివేదిక పలు సూచనలు చేసింది.

10TV Telugu News

unesco study : indian media excessively focus on unusual cases : అత్యాచార కేసులు, లైంగిక వేధింపుల కేసుల విషయంలో భారత మీడియా రిపోర్టింగ్‌ యునెస్కో కీలక వ్యాఖ్యలు చేసింది. యునెస్కో షాకింగ్ విషయాలు వెల్లడించింది. భారతదేశంలోని మీడియా అత్యాచారం కేసులను, లైంగిక వేధింపుల కేసులను ఎలా చూస్తోంది? అనే విషయంపై యునెస్కో నుంచి ఇటువంటి రిపోర్ట్ వస్తుందని ఊహించకపోవటంతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లైంగిక వేధింపుల ఘటనల విషయంలో భారత మీడియా రిపోర్టింగ్‌పై ఐక్యరాజ్యసమితి విద్యా, సాంకేతిక, సాంస్కృతిక సంస్థ – యునెస్కో భారత మీడియా వైఖరిపై విమర్శలు చేసింది. భారత దేశంలోని 6 భాషలకు చెందిన 10 దినపత్రికలపై యునెస్కో పరిశోధన చేసి ఈ నివేదికను రూపొందించింది. అలాగే 14 భాషలకు చెందిన ప్రింట్, రేడియో, ఆన్​లైన్ మీడియాకు చెందిన 257 మంది జర్నలిస్టులను సైతం ఇంటర్వ్యూలు చేయగా వచ్చినవాటితో ఈ నివేదిక తయారైంది. ఇంతకూ ఈ భారత్ మీడియాపై యునెస్కో చేసిన వ్యాఖ్యలేమిటంటే..

‘సెక్సువల్​వయలెన్స్​అండ్ న్యూస్ మీడియా: ఛాలెంజెస్ అండ్ గైడ్​లెన్స్​ఫర్ జర్నలిస్ట్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను యునెస్కో విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసులను రిపోర్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను ఈ నివేదికలో యునెస్కో పలు సూచనలు చేసింది. అలాగే భారత్ మీడియా వ్యవహరించే తీరుపై ప్రస్తుత పరిస్థితిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.లైంగిక హింసల్లో క్రూరత్వం, తీవ్రమైన హింస జరిగిన కేసులపైనే భారతీయ మీడియా ఎక్కువ దృష్టి సారిస్తోందని వెల్లడించింది. ఇటువంటి దృష్టి సరైంది కాదని సూచించింది. ఇలా చేయటం వల్ల లైంగిక వేధింపులు ఎలా జరుగుతున్నాయనే విషయం మరుగున పడిపోతోందని తెలిపింది. అంతేకాదు దీని వల్ల లైంగిక వేధింపుల సమస్యే పక్కదారి పడుతోందని తెలియజేసింది. ఈ కేసుల్లో బాధితులు గానీ..లేదా ఆరోపణలు ఎదుర్కొనేవారు గానీ, లేదా నేరస్తులు గానీ సమాజంలో ప్రముఖులైతే భారతీయ మీడియా వారిని చాలా ఎక్కువగా ఫోకస్ చేసి అప్ డేట్స్ ఇస్తోందని తమ అధ్యయనంలో తేలిందని..ఈ అధ్యయనంలో 20 శాతానికి పైగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నివేదికలో వెల్లడించింది.

భారత్ లోని న్యూస్‌రూమ్‌లలో అధికారిక ఎడిటోరియల్ మార్గదర్శకాలు స్పష్టంగా లేవని అధ్యయనం పేర్కొంది. లైంగిక వేధింపుల గురించి పోలీసులు, అధికార యంత్రాంగం ప్రకటిస్తున్న విషయాలను 16.7 శాతం రిపోర్టు చేస్తున్న మీడియా నేరం తీవ్రతను బట్టి 14 శాతం అత్యాచార కేసులను కవర్ చేస్తోందని ..పట్టణాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు 44 శాతం న్యూస్​పేపర్లలో కవర్ అవుతుండగా… గ్రామాల్లో వేధింపుల ఘటనలు మరుగున పడిపోతున్నాయని తెలిపింది. అంటే పట్టణాల్లో జరిగిన కేసులను కవర్ చేస్తోంది గానీ గ్రామాల్లో జరుగుతున్న వేధింపులపై పెద్దగా దృష్టి పటెట్టంలేదనీ గ్రామాల్లో 22 శాతం ఘటనలు మాత్రమే మీడియా కవర్ చేయగలుగుతోందని తెలిపింది.

అత్యాచార వార్తలు కవర్ చేస్తున్న సందర్భంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను విశ్లేషించకుండా ఘటనకు సంబంధించిన దాని గురించే పదే పదే రిపోర్ట్ చేస్తోందనీ..తెలిపింది. అలాగే తమ అధ్యయనంలో అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో సమాజంలో మార్పు తీసుకురావడం తమ బాధ్యతగా 78 శాతం జర్నలిస్టులు భావిస్తున్నారని రిపోర్టులో పేర్కొంది. అయితే కేవలం 7శాతం స్టోరీలు మాత్రమే వేధింపుల సమస్య అంతమయ్యే పరిష్కారాలేంటన్న విషయంపై దృష్టి సారించేలా ఉన్నాయని నివేదిక చెప్పింది.కాగా..లైంగిక వేధింపుల కేసుల రిపోర్టింగ్ విషయంలో జర్నలిస్టులకు యునెస్కో నివేదిక కొన్ని సూచనలు చేస్తూ.. ఇటువంటి హింసాత్మక అంశాలపై రిపోర్టింగ్ సున్నితంగా ఉండాలని, మీడియా యాజమాన్యాలు పూర్తి బాధ్యతతోను..జవాబుదారీతనంతో ఉండాలని సూచించింది. ఈ కేసులకు సంబంధించి ఎవరూ మానసికంగా కుంగిపోకుండా ఉండేలా వార్తలు ఉండాలని చెప్పటంతో పాటు ఇటువంటి కేసుల గురించి రిపోర్టింగ్ చేసేటప్పుడు వినియోగించే భాష కూడా సున్నితంగా ఉండాలని సూచించింది.

వారి రేటింగ్ పెంచుకోవటానికి సర్య్కులేషన్ పెంచుకోవటానికో తీవ్రమైన పదాలు వాడకుండా ఉండాలంది. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించటం చాలా ముఖ్యమైన అంశమని..దాని ద్వారా వెల్లడైన విషయాలను మాత్రమే రిపోర్టింగ్ చేయాలని..అది కచ్చితం అని నిర్ధారణ అయ్యాకే మైన నిజాలు బయటికి వచ్చాకే వివరాలను బయటకు చెప్పాలని సూచించింది. అలాగే ఇటువంటి ఘటనల్లో సమస్య ఎలా పరిష్కారమవుతుందనే విశ్లేషణలను కూడా అందించాలని అటువంటి కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

సమాజంలో లైంగిక వేధింపులు తగ్గేలా మీడియా బాధ్యతగా ఉండాలని..దాని కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎటువంటి చర్చలు జరగాలి? చట్టాలు ఎలా అమలు చేయాలి?దీంట్లో ఎవరి బాధ్యత ఎంత? అనే పలు కీలం అంశాలను వెల్లడించాలని..దానిపై అన్ని సంస్థల ఎడిటోరియల్ విభాగాలు చర్చించుకోవాలనీ, ఇందుకు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా అని విశ్లేషణ చేసుకోవాలని నివేదిక వెల్లడించింది. ఇటువంటివి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలు,హింసలు,అత్యాచారాల విషయంలో చాలా అవసరమని పేర్కొంది. సమాజంలో మార్పు వచ్చేందుకు జర్నలిస్టులందరూ దృష్టి సారించాలని యునెస్కో నివేదిక సూచించింది. ఇది మీడియా బాధ్యత అని సూచించింది. బాధ్యత మరచి మీడియా వ్యవహరించకూడదని..మీడియా అనేది చాలా ప్రభావవంతమైన ఆయుధం అని ఆయుధాన్ని నేరాలను అరికట్టటానికి..నియంత్రించటానికి వాటి పరిష్కారం కోసం పనిచేయాలని సూచించింది.

10TV Telugu News