Tiranga Bike Rally : తిరంగా బైక్ ర్యాలీ 130 కోట్ల ప్రజల దేశభక్తిని చాటుతుంది

తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర  సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి  కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.

Tiranga Bike Rally : తిరంగా బైక్ ర్యాలీ 130 కోట్ల ప్రజల దేశభక్తిని చాటుతుంది

har ghar tiranga bike rally

Tiranga Bike Rally : తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర  సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి  కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపినిచ్చింది.  ఈ కార్యక్రమంలో  భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ర్యాలీని ప్రారంభించిన అనంతరం  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… హర్ ఘర్ తిరంగా అనేది రాజకీయాలకు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని…. ఇది దేశంలోని 130 కోట్ల దేశ ప్రజలకు తిరంగపై ఉన్న దేశభక్తిని చాటే విషయానికి సంబంధించినదన్నారు. అంతే కాకుండా.. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రతిపక్షనేతలెవరూ స్టేట్ మెంట్స్ చేయకూడదని కోరారు. ఆగష్టు 15న అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి సూచించారు.