TNR : డైరెక్షన్ కల తీరకుండానే.. టీఎన్ఆర్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకునే వారంటే..

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఉధృతంగా విజృంభిస్తూ ఎంతోమందిని బలి తీసుకుంటోంది.. ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్ టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) మే 10న కరోనాతో కన్నుమూశారు..

TNR : డైరెక్షన్ కల తీరకుండానే.. టీఎన్ఆర్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకునే వారంటే..

Unknown Facts About Popular Anchor Tnr Remuneration Details

TNR: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఉధృతంగా విజృంభిస్తూ ఎంతోమందిని బలి తీసుకుంటోంది.. ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్ టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) మే 10న కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణవార్తను సినీ, మీడియా రంగాల వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పాపులర్ యూట్యూబ్ ఛానెల్‌లో సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వూలు చేస్తూ బాగా పాపులర్ అయిన టీఎన్ఆర్ దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. పలు క్రైమ్ షోలు డైరెక్ట్ చేశారు.



TNR: విషాదం.. కరోనాతో జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత!

అయితే టీఎన్‌ఆర్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ షో’. ఈ షో ద్వారా తన స్టైల్‌లో సెలబ్రిటీలను ఇంటర్వూ చేసి పాపులరిటీతో పాటు యూత్‌‌ ఫాలోవర్స్‌ను కూడా సంపాదించుకున్నారాయన. రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ వంటి స్టార్‌ డైరెక్టర్లను ఇంటర్య్వూ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి టీఎన్‌ఆర్‌ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అలా ఇప్పటి డిజిటల్‌ తెలుగు మీడియా రంగంలో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ తీసుకునే యాంకర్లలో టీఎన్ఆర్ కూడా ఒకరయ్యారు.



TNR

ఆయన ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకునేవారో తెలుసా?.. షో డ్యూరేషన్‌ని బట్టి ఒక్కో ఇంటర్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి అంతకుపైగానే పారితోషికం అందుకునేవారని సమాచారం. ఇటీవల కాలంలో నటుడిగా బాగా బిజీ అయిన టీఎన్ఆర్ ఇటీవల నటించిన దాదాపు అరడజనకు పైగా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.. అయితే ఎప్పటికైనా దర్శకుడు కావాలనే తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు టీఎన్ఆర్..



TNR