Actress Remuneration : వీళ్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హీరోతో పాటు సమానంగా స్క్రీన్ స్పేస్ ఉన్నా, కమర్షియ‌ల్‌గా మార్కెట్ ఉన్నా హీరోయిన్స్‌కి మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు ప్రొడ్యూసర్లు..

Actress Remuneration : వీళ్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Actress Remuneration: హీరోతో పాటు సమానంగా స్క్రీన్ స్పేస్ ఉన్నా, కమర్షియ‌ల్‌గా మార్కెట్ ఉన్నా హీరోయిన్స్‌కి మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు ప్రొడ్యూసర్లు. కానీ, కొంతమంది హీరోయిన్లు మాత్రం మాకు డిమాండ్ ఉంది కాబట్టి.. అడిగినంత ఇవ్వాల్సిందే.. అస్సలు తగ్గేదే లేదంటున్నారు..

సినిమా కోసం ఎన్ని ఫీట్లు చేసినా.. ఎన్ని ఫైట్లు చేసినా మహా అయితే మూడు కోట్లు.. అబ్బో, ఇంకా అడిగితే 5 కోట్లు.. అంతే.. టాప్ 3 లో ఉన్న హీరోయి‌న్‌కి, కనీసం టాప్ 20 లో కూడా లేని హీరోకిచ్చే రెమ్యునరేషన్ కూడా ఇవ్వరని ఆ మధ్య సమంత లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది అందరికీ. ఈ దెబ్బకి రెమ్యునరేషన్ విషయంలో బేరాల్లేవంటున్నారు హీరోయిన్లు. అంతకుముందు ఆచితూచి ఇచ్చే ప్రొడ్యూసర్లు డిమాండ్ ఉన్న హీరోయిన్ కావాలంటే అడిగినంత ఇస్తున్నారు. లేటెస్ట్‌గా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ కోసం సమంత 3 నుంచి 4 కోట్లు తీసుకుందని టాక్.

సమంతతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ కూడా బాగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్, అలౌకిక్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘సీత’ సినిమాకి సంబంధించి కరీనా కపూర్ 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తోంది. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైనా.. ఇంకా కరీనా కపూర్‌కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.. అందుకే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గించుకోవట్లేదు కరీనా కపూర్.

ఈ మధ్య పూజా హెగ్డే టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో బిజీగా ఉంది. తన మార్కెట్ పెరగడంతో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగింది అందుకే.. రెండున్నర కోట్లకు రెమ్యునరేషన్ అడిగిందని.. అమ్మో, అప్పుడే పూజకి అంత కావాలా అంటూ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యాయి. సౌత్‌తో పాటు నార్త్ స్టార్ హీరోలతో నటిస్తున్న పూజా.. మినిమం 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంలో అస్సలు తప్పులేదని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.