కాలేజీ సర్క్యులర్ వైరల్ : అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే..లేదంటే కాలేజీలో అడుగు పెట్టనియ్యం..!!

కాలేజీ సర్క్యులర్ వైరల్ : అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే..లేదంటే కాలేజీలో అడుగు పెట్టనియ్యం..!!

UP Agra:  college girls student boyfriend Compulsory : ఓ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు యాజమాన్యం పంపించిన వింత సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మాయిలూ.. మీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే..వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రండ్ అయినా ఉండాల్సిందే..లేకపోతే.. కాలేజీలోకి అడుగుపెట్టనీయ్యం..మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా మాకు చూపించాలి..’ అంటూ సదరు కాలేజీ యాజమాన్యం పంపించిన సర్క్యులర్ వైరల్ గా మారింది.

పైగా అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండటం చాలా చాలా మంచిది..అది వారి సేఫ్టీ కోసమేనంటోంది సదరు కాలేజీ. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కాలేజీ సర్క్యులర్. ఈ సర్క్యులర్ సారాంశం అంతటితో ఆగలేదు. ‘అమ్మాయిలూ..ప్రేమను పంచండి’ అంటూ ఓ సలహా కూడా ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా నగరంలో గల ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనబడుతున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపటమే కాకుండా సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. ఈ సర్క్యులర్ ప్రొఫెసర్ అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారి అయినట్టు తెలుస్తోంది. ఈ సర్క్యులర్ ఫస్ట్ ఫస్ట్ సదరు కాలేజీ స్టూడెంట్స్ వాట్సాప్‌ గ్రూపుల్లో బయటపడ్డ ఈ ఆదేశాలు క్రమంగా సోషల్ మీడియా బాట పట్టి వైరల్ అయ్యాయి.

దీంతో కాలేజీ విద్యార్థులు ఈ విషయాన్ని వారి వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా.. ఈ వ్యవహారమంతా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో ప్రిన్సిపాల్ ప్రొ. ఎస్పీ సింగ్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రొ. అశిశ్ శర్మ అనే పేరుగల లెక్చరర్ అసలు తమ కాలేజీలో లేరని ష్టం చేశారు.

ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు అనే విషయంపై ఎంక్వయిరీ వేసి వారిని వెతికిపట్టుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమ్మాయిల్ని ఆందోళన చేయటానికి ఫైనలియర్ విద్యార్థులెవరైనా ఇటువంటి కొంటె పనులు చేసి ఉండవచ్చని కాలేజీ వర్గాలు అనుమాలు వ్యక్తంచేస్తుననారు. ఇక ఆగ్రాలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన సెయింట్ జాన్స్‌ను 1850లో బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు.