నెల రోజుల పసిబిడ్డకు వైద్యం చేయించలేక వేలానికి పెట్టిన తల్లి..

  • Published By: nagamani ,Published On : December 9, 2020 / 12:06 PM IST
నెల రోజుల పసిబిడ్డకు వైద్యం చేయించలేక వేలానికి పెట్టిన తల్లి..

UP Agra Mother not get treatment for baby Auction : తాగుడు మైకంలో పడి ఇంటికి భార్యా పిల్లల్ని పట్టించుకోని భర్త..మరోవైపు పసిబిడ్డ చిట్టి బొజ్జను కూడా నింపలేని దుస్థితి తీవ్ర ఆవేదన చెందుతున్న ఓ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకలితో అల్లాడిపోయే నెలన్నర పసిబిడ్డ అనారోగ్యం పాలై కళ్లముందే తల్లడిల్లితుంటే చూడలేని ఆ తల్లి మనస్సు చంపుకుని ఆ బిడ్డను వేలంలో పెట్టింది.



‘‘నవమాసాలు మోసి కన్నాను గానీ..నీ ఆకలి కూడా తీర్చలేకపోతున్న ఈ అమ్మను శంపించు బిడ్డా అని అంగలారుస్తు’’ కన్నబిడ్డను నడిరోడ్డుపై అమ్మాకానికి పెట్టిందా తల్లి ఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే అమ్ముతానంటూ వేలానికి పెట్టింది.



నెలన్నర పసిపిల్లవాడికి వైద్యం చేయించలేని దుస్థితిలో ఆ తల్లి. ఈ విషయం కొందరు సామాజిక కార్యకర్తలకు తెలిసి వారు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు వెంటనే ఆ తల్లీబిడ్డలు ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. పిల్లవాడిని స్వాధీనం చేసుకుని..చికిత్స కోసం ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ‘‘బిడ్డల్ని ఇలా అమ్ముకోకుడదు తల్లీ అని ఆమెకు నచ్చచెప్పి..ఆమెకు 11 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చారు.



వివరాల్లోకి వెళితే..ఆగ్రాలోని ఒక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తాగుడుకు బానిసగా మారి, ఇంటిని పట్టించుకోవడం మాసేశాడు. కాయకష్టం చేసి తన మూడేళ్ల బిడ్డను పోషంచుకుంటోంది ఆ భార్య. ఈక్రమంలో సరైన ఆహారం లేక..ఆమె అనారోగ్యంబారిన పడింది. దీంతో కొడుకుని కాస్త అన్నం పెడితే చాలు అని బతిమాలుకుని బంధువులకు అప్పగించింది.


ఆ తరువాత ఆమె గర్భం దాల్చింది. ఇంటిని పట్టించుకోకపోయినా ఆ భర్తకు భార్య అవసరం ఉంది. దీంతో ఆమె గర్భం దాల్చి..నెలన్నర క్రితం మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డనైతే కన్నదిగానీ కడుపునిండా తిండిలేక ఆమె బిడ్డకు పాలు ఇవ్వలేకపోయింది. ఆ పసిబిడ్డ చిట్టి బొజ్జకూడా నింపలేని దుస్థితికి చేరింది. ఈక్రమంలు కడుపునిండా పాలు లేక..ఆ బిడ్డకూడా అనారోగ్యంపాలయ్యాడు.



గబగబా ఆమె పిల్లవాడిని గత సోమవారం (డిసెంబర్7,2020) ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చింది. కానీ అక్కడ చికిత్స లభించకపోవడంతో బయటకు వచ్చింది.ఏం చేయాలో పాలుపోలేదు. కడుపే నింపలేని ఆ తల్లికి బిడ్డకు వైద్యం చేయింటానికి డబ్బులెక్కడివి? దీంతో తన కళ్లముందే బిడ్డ చనిపోతాడేమోనని భయపడింది. దీంతో ఎక్కడోక చోట తన బిడ్డ ప్రాణాలతో ఉంటేచాలనుకుంది. పిల్లాడిని అమ్మకానికి పెట్టింది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి అమ్మాలని నిశ్చయించుకుంది.



ఈ విషయం తెలిసిన కొంతమంది ఆమె దగ్గరకొచ్చి పిల్లాడిని బేరం అడారు. ఎంతకిస్తావని అడిగారు. రూ. 10 వేలకు అమ్ముతానని చెప్పింది. దీనికి సదరు వ్యక్తులతో బేరం కుదిరింది. కానీ ఇంతలో ఈ విషయం సామాజిక కార్యకర్తలకు తెలియటం..వాళ్లు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు బిడ్డ అమ్మకాన్ని అడ్డుకున్నారు.



బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే ఆమెకు 11వేల ఆర్థికసాయం అందించడంతోపాటు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆ పసిబిడ్డ అమ్మకం ఆగిపోయింది.