Uttarapradesh : వరమాల వేస్తు ముద్దు పెట్టిన వరుడు .. పెళ్లొద్దు పొమ్మన్న వధువు

వరమాల వేస్తు వధువుకు ముద్దు పెట్టాడు వరుడు..దీంతో పెళ్లొద్దు పొమ్మంటూ పీటలమీద నుంచి లేచి వెళ్లిపోయింది వధువు.

Uttarapradesh : వరమాల వేస్తు ముద్దు పెట్టిన వరుడు .. పెళ్లొద్దు పొమ్మన్న వధువు

Uttarapradesh groom kissing bride marriage cancellation : వధువు మెడలో వరమాల వేస్తూ వరుడు వధువును ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. అంతే నువ్వు వద్దు నీతో పెళ్లి వద్దు పొమ్మంది. అంతే పెళ్లి పీటలమీద నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో వరుడు ఖిన్నైపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహ పథకం కింద బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి వివాహం జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం (నవంబర్ 29,2022)వరుడు.. కుటుంబ సభ్యులతో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అందరిముందు నన్ను ముద్దు పెట్టుకుంటావా అంటూ కోపంతో సర్రుమంటూ పీటలమీద నుంచి లేచిపోయింది. నీకు ఈ పెళ్లి వద్దంటూ అక్కడనుంచి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఓ చిన్నపాటి గొడవ జరగ్గా.. విషయం పంచాయతీ వరకు వెళ్లింది. అయినా.. వధువు నిర్ణయం మారలేదు. కాగా విషయం కాస్తా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. పోలీసులు..బంధువులు ఎంతగా నచ్చచెప్పినా వధువు మాత్రం పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. ఈక్రమంలో పోలీసులకు తాను పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో వివరించింది.

‘వరుడు తనకు సంప్రదాయం ప్రకారం ముద్దు పెడితే తాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేదాన్ని కాదని పెళ్లికి ముందే నన్ను ముద్దు పెట్టుకుంటాను చూడండీ అంటూ వరుడు తన స్నేహితుల వద్ద పందెం కాశాడని పందెం కోసం ఇలా చేస్తాడా? అసభ్యంగా తాకాడని..నా ఆత్మగౌరవం గురించి ఆలోచించకుండా స్నేహితులు రెచ్చగొట్టారని తన పందెం గెలవటానికి మాత్రమే ఆలోచించే అటువంటి వ్యక్తి తనకు అవసరం లేదు అంటూ తెగేసి చెప్పిందా వధువు. కేవలం ముద్దు పెట్టుకోవటమే కాకుండా వందలమంది ముందు తనను అనుచితంగా తాకాడు అంటూ మండిపడింది. ఇటువంటి వ్యక్తిపై తన జీవితాన్ని పంచుకోలేనని స్నేహితులతో పందెం గెలవటానికి అతను ఏదైనా చేస్తాడని నాకు అనిపించింది. అందుకే పెళ్లి తరువాత ఇబ్బందులు పడేకంటే పెళ్లిముందే తగిన నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.

కూతురు నిర్ణయానికి సగటు తండ్రిగా ఆందోళన పడ్డారు. కూతున్ని ఒప్పింటానికి యత్నించాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. వరుడు అతని స్నేహితులు రెచ్చగొట్టారని అందుకే ఇలా చేశాడని తనకు తెలిసిందని తెలిపారు. అలా ఓ ముద్దు..వరుడు అత్యుత్సాహం పెళ్లి చెడగొట్టుకునేలా చేసింది.