కారుపై కులం పేరు..ఆపేసి Fine వేసిన పోలీసులు

కారుపై కులం పేరు..ఆపేసి Fine వేసిన పోలీసులు

UP challan issued for displaying caste identity on car : కార్లపైనా బైకుల పైనా ఊర్ల పేర్లు, కులాల పేర్లు రాస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయని ఓ వ్యక్తి తన కారు వెనుక అద్దాలపై ‘కులం’పేరును రాసుకున్నాడు. అది గమనించిన పోలీసులు సదరు కారు వ్యక్తిని ఆపి ఫైన్ వేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో కులం పేర్లను కారు అద్దాలపై, నంబర్ ప్లేట్లపై రాస్తే కఠిన చర్యలు తప్పవని యోగి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆ నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఈక్రమంలో జధాని లక్నోలో ఓ కారు వెనుక అద్దంపై ‘సక్సేనా జీ’ అని రాసి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆ కారును ఆపి ఛలాన్ విధించారు.

దీనిపై కాన్పూర్ డిప్యూటీ ట్రాన్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి మాట్లాడుతూ..యూపీలో తిరుగుతున్న ప్రతీ 20 వాహనాల్లో ఒక వాహనంపై ఇలా కులం పేర్లతో స్టిక్కర్లు అంటించి ఉంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాహనాలపై కులం పేరుతో స్టిక్కర్లు ఉంటున్నాయనీ..కానీ యూపీలో మాత్రం ఇవి ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. ఇటువంటి కులాల పోకడలు సరైనవి కాదని దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.

కాగా..యూపీలో ములాయం సింగ్ యాద్ పార్టీ అయిన సమాజ్‌వాదీ అధికారంలో ఉన్న సమయంలో చాలా వాహనాలపై ‘యాదవ్’ అనే స్టిక్కర్లు కనిపించేవి. ఆ కులానికి చెందిన వారు అధికారంలో ఉండటంతో కొందరు దాన్ని హోదాలా భావించేవారు. యూపీలో మాయావతి అధికారంలో ఉన్న సమయంలో కూడా జాతవ్ అనే కులం పేరుతో కూడిన స్టిక్కర్లను కొందరు వాహనాలపై అంటించుకునేవారు. బీఎస్పీ ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ ఇలా ‘జాతవ్’ పేరుతో ఉన్న వాహనాలు యూపీ రోడ్లపై చక్కర్లు కొడుతుండటం గమనార్హం.