UP Dalit Teen: దళిత బాలుడితో చెప్పు నాకించిన దుర్మార్గులు

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మైనర్ బాలుడికి దారుణమైన అవమానం జరిగింది. దళిత్ కమ్యూనిటీకి చెందిన వాడనే దురుద్దేశ్యంతో కాలు, చెప్పు నాకించారు దుర్మార్గులు. దీనికి సంబంధించిన..

UP Dalit Teen: దళిత బాలుడితో చెప్పు నాకించిన దుర్మార్గులు

Uttarapradesh

UP Dalit Teen: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మైనర్ బాలుడికి దారుణమైన అవమానం జరిగింది. దళిత్ కమ్యూనిటీకి చెందిన వాడనే దురుద్దేశ్యంతో కాలు, చెప్పు నాకించారు దుర్మార్గులు. దీనికి సంబంధించిన 2నిమిషాల 30సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా అతనికి శిక్షగా చేతులతో నేలమీద నిల్చొని చెవులు నేలకు ఆనిస్తూ ఉండాలని విధించారు. ఆ వీడియోలో మిగిలిన వారంతా మోటార్ సైకిళ్లపై కూర్చొని పైశాచిక ఆనందంతో విర్రవీగుతుండగా.. బాధితుడు భయంతో వణికిపోతున్నాడు. నిందితుల్లో ఒకరు ఉన్నత కులానికి చెందిన Thakurఅనే పేరు ఉచ్ఛరించాలని చెప్పి.. బూతులు మాట్లాడాడు. మరోసారి ఆ తప్పు చేస్తావా అంటూ వేలు చూపిస్తూ బెదిరించారు.

వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. నిందితులు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 10న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితుల్లో కొందరు మాత్రమే అగ్రకులాలకు చెందిన వారు.

Read Also : ఆలయంలోకి వెళ్లిన దళితులు..అస్పృశ్య‌త‌, వివ‌క్ష‌ల‌కు ముగింపు

“బాధితుడైన విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేసిన వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద UP పోలీసులు కేసు నమోదు చేశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది” అని సీనియర్ పోలీసు అధికారి అశోక్ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

బాధితుడు పదో తరగతి చదువుతూ వితంతువు అయిన తల్లితో కలిసి ఉంటున్నాడు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. బాధితుడి తల్లి పొలాల్లో కూలీ పనులకు వెళ్తుండేది. బాధితుడి సోదరి స్పందిస్తూ.. తన సోదరుడిపై దాడి ఎందుకు చేశారో స్పష్టం కాలేదని, నిజమైన సమాధానం చెప్పడం లేదని వాపోయింది. ఇలాంటి దారుణ ఘటన మరెవ్వరికీ జరగకూడదని మీడియా ముందు కోరింది.