Gold Coins: బాత్రూమ్ కోసం గుంత తవ్వితే దొరికిన బంగారు నాణేలు

ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో బాత్రమ్ కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు లభ్యమయ్యాయి.

Gold Coins: బాత్రూమ్ కోసం గుంత తవ్వితే దొరికిన బంగారు నాణేలు

Gold Coins Found During Excavation In Jaunpur

Gold coins found in bathroom site : ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో బాత్రమ్ కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు లభ్యమయ్యాయి. జౌన్ పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో నూర్జహాన్ కుటుంబం తమ ఇంట్లో ఓ బాత్రూం నిర్మాణం కోసం గుంత తవ్వుతున్నారు. ఈ తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ఆ గుంతలో ఓ రాగిపాత్ర కనిపించింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. ఆ రాగిపాత్రలో ఏముందా? అని తీసి చూడా వారి కళ్లు చెదిరిపోయేలా బంగారు నాణేలు కనిపించాయి.

ఈ విషయం బయటకు ఎవ్వరికి చెప్పవద్దని నూర్జహాన్ కుటుంబం గుంత తవ్వే కూలీలను హెచ్చరించింది. బంగారు నాణాల్లో తమకు కూడా కొంత ఇవ్వాలని అడిగారు. దానికి నూర్జహాన్ కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో వారు ఎదురు తిరిగారు. పని ఆపేసి వెళ్లిపోయారు. వారు తిరిగి మరుసటి రోజు రాగా నూర్జహాన్ కుటుంబం వారికి ఓ బంగారు నాణెం ఇచ్చింది. ఈ క్రమంలో విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది.

అలా గుంతలో బంగారు నాణాలు దొరికాయని పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వారు హుటాహుటినా పోలీసులు నూర్జహాన్ ఇంటికి చేరుకున్నారు. విషయంపై ఆరా తీశారు. గుంతను పరిశీలించారు. పోలీసులు ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అవి బ్రిటీష్ పాలన నాటివని గుర్తించారు. 1889-1920 మధ్య కాలం నాటివని వెల్లడైంది. కాగా, పోలీసులకు భయపడి కొందరు కూలీలు పరారీలో ఉన్నట్టు తెలిసింది. పరారీలో ఉన్న కూలీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.