శివుడు కోసం..కిరీటం పెట్టుకుని, త్రిశూలంతో మహిళ సజీవ సమాధి..భజలను చేస్తూ ప్రోత్సహించిన జనాలు

శివుడు కోసం..కిరీటం పెట్టుకుని, త్రిశూలంతో మహిళ సజీవ సమాధి..భజలను చేస్తూ ప్రోత్సహించిన జనాలు

Lord shiva happy the woman took samadhi : పరమ శివుడి కోసం ఓ మహిళ ఏకంగా సజీవంగా సమాధి అవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంది. ఆమెను వారించపోగా గ్రామస్థులు పాటలు పాడుతూ..భజనలు చేస్తూ ప్రోత్సహించారు. గొయ్యిలో కూర్చున్న ఆమెపై కట్టెలు..మట్టి పోసి సమాధి చేసిన ఘటన యూపీలోని కాన్పూర్‌ పరిధిలోని మఢా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆఘమేఘాలమీద పరుగెత్తుకుని వచ్చి ఆమెను గొయ్యిలోంచి బైటకు తీసారు..ఆ తరువాత ఏమైందంటే..

మఢా గ్రామంలో రామ్ సజీవన్ అనే వ్యక్తి భార్య గయావతి ఉరఫ్ గౌతమి. వయస్సు 52 ఏళ్లు. ఆమె శివ భక్తురాలు. ఇంటికి సమీపంలో ఉన్న ఒక శివాలయంలో పూజలు చేస్తూ వస్తోంది. ప్రతీ రోజు శివుడికి పూజలు చేయనిదే పచ్చి గంగ అయినా నోట్లో పోసుకోదు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో శివుడ్ని కొలుస్తుంటుంది. స్త్రోత్రాలు చదువుతుంది. అలా ఆమె అంటే గ్రామస్థులకు ఎంతో నమ్మకం ఏర్పడిపోయింది. అబ్బా ఎంత భక్తో అంటూ ఆమెనో దేవతలా చూసేవారు. ఆమె పిలస్తే శివుడు పలుకుతాడని నమ్ముతారు. ఆమెకలలో శివుడు కనిపిస్తుంటాడని చెబుతారు.

అలా ఆమె శివపూజలు ఎక్కువైపోయాయి. ఎంత ఎక్కువైపోయాయంటే..ఏకంగా శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఏకంగా సజీవంగా సమాధి అయిపోయేంతగా..
శివుడు నాకు కనిపించి మాట్లాడతాడని..తాను పరమశివుడి అంశనని చెబుతుంటుంది. ఆమె భర్త కూడా ఆమెను ప్రోత్సహిస్తుంటాడు. నా భార్యకు కలలో శివుడి కనిపించి మాట్లాడతాడను చెబుతుంటాడు. ఈక్రమంలో శివుడు నాకు కనిపించి తనలో ఐక్యం కమ్మని చెప్పాడని..దాని కోసం సజీవ సమాధి అవుతానని చెప్పింది. దానికి భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా మద్దతు పలికారు.

సజీవ సమాధి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటి ముందు టెంట్‌వేసారు. ఐదగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతైన గొయ్యి తవ్వారు. ఈ విషయం గ్రామస్తులందరికీ చెప్పారు. దానికి వారు కూడా సంతోషించారు. బుధవారం (జనవరి 10,2021) ఉదయం బంధువులు, గ్రామస్తులు చేరుకున్నారు. 10 గంటల సమయంలో గయావతి ఎర్రని చీర కట్టుకుంది. తలపై కిటీటం పెట్టుకుని..శివుడి ఆయుధమైన త్రిశూలం చేత పట్టుకుని ఇంటిముందు తవ్విన గొయ్యిలో కూర్చుంది.

తరువాత ఆమె కొడుకులు అరవింద్, రవీంద్ర ఆ గొయ్యిని కర్రలతో కప్పేశారు. తరువాత దానిపై మట్టిపోశారు. అలా ఆమెను కట్టెలతోను..మట్టితోను కప్పేశారు. ఆ తరువాత ఆ సమాధిని రకరకాల పూలతో అలంకరించారు. గ్రామస్తులంతా ఆ సమాధి చుట్టూ కూర్చుని శివుడి పాటలు పాడుతూ..భజనలు చేయటం మొదలుపెట్టారు.

ఈ విషయం ఆనోటా ఈ నోటా అధికారులకు తెలిసింది. అధికారులంతా ఎస్డీఎం సీఓ పోలీసు సిబ్బందితో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సమాధిలోంచి ఐదు గంటలపాటు శ్రమించి మహిళను బయటకు వెలికి తీశారు. ఆమెకు ఇంకా భూమ్మీద నూకలున్నాయేమో..ప్రాణాలతోనే ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం అక్కడ ఆమె కోలుకుంది.ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో గయావతిని పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. కాగా..ఆమె సజీవ సమాధిని ప్రోత్సహించినవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.