సీన్ రివర్స్ : పెళ్లి ఆపి వరుడ్ని ఎత్తుకుపోయిన ప్రియురాలు

  • Published By: nagamani ,Published On : December 10, 2020 / 11:48 AM IST
సీన్ రివర్స్ : పెళ్లి ఆపి వరుడ్ని ఎత్తుకుపోయిన ప్రియురాలు

up wedding groom girlfriend Entry : సినిమాల్లో పెళ్లి సీన్ జరుగుతుంటే హఠాత్తుగా ఎవరోకరు వచ్చిన ఆపండీ అని అరుస్తారు. లేదా..పెళ్లి మండపంలోని హీరో బైక్ వేసుకుని రయ్ మంటూ దూసుకొచ్చి పెళ్లికూతుర్ని ఎత్తుకుపోతాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లికొడుకు ప్రియురాలు పెళ్లిలో ఎంట్రీ ఇచ్చింది. వారిద్దరు తీయించుకున్న పెళ్లి ఫోటోలతో సహా వచ్చి పెళ్లికొడుకు చేయి పట్టుకుని కారులో కూర్చోపెట్టుకుని తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.



ఉత్తరప్రదేశ్ లోని లక్నో పెళ్లి వేడుకలో..పెళ్లి జరుగుతుండా ఓ యువతి హఠాత్తుగా ప్రత్యక్షమైంది. వచ్చీ రావటంతోనే పెళ్లికొడుకు దగ్గరకెళ్లి అతని చేయి పట్టుకుని కారులో కూర్చోపెట్టుకుని రయ్ మంటూ దూసుకుపోయింది. దీంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు..



సినిమా సీన్ లాంటి ఈ ఘటన వివరాల్లోకి వెళితే..అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో.నగరంలోని ఓ కళ్యాణమండపంలో పెళ్లి వేడుక జరుగుతోంది. అంతా పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇంతలో సడెన్ గా ఓయువకుడు ప్రత్యక్షమయ్యాడు. పెళ్లిని ఆపించేసి.. వధువును తనతో పాటు కారులో తీసుకువెళ్లిపోయాడు. అలా వచ్చినవాడు వధువు ప్రియుడేనని తరువాత తెలిసింది. దీంతో మగపెళ్లివారు పరువు పోయి దిగాలుగా కూర్చుండిపోయారు.



పెళ్లి జరగకుండానే అక్కడి వరుడితో సహా అందరూ వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసినవాంతా ముక్కుమీద వేలేసుకున్నారు. హన్నన్నా..ఇటువంటివిసినిమాల్లో చూశాం గానీ మేమెక్కడా చూడలేదమ్మా అంటూ తెగ ఆశ్చర్యపోయారు.



సినిమా సీన్ లాంటి ఈ ఘటన వివరాల్లోకి వెళితే..ఉన్నావ్ జిల్లాకు చెందిన వరుడు తన బంధువర్గంతో సహా లక్నోలోని కకోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్పూర్ మౌ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ వధువు తరపువారు ఏర్పాటు చేసిన కల్యాణమండపానికి చేరుకున్నాడు. పెళ్లి తంతు జరుగుతోంది. సరిగ్గా వధూవరులు దండలు మార్చుకునే సమయానికి సినీస్టయిల్‌లో వరుడు ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే వరుడికి దిమ్మ తిరిగిపోయింది.



కానీ ఆమె మాత్రం డైరెక్ట్ గా వరుడు దగ్గరకొచ్చి అతని చేయి పట్టుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన వధువు తండ్రి రామేశ్వరం తన కూతురికి ఆ యువకునితోనే వివాహం జరిపించాలనుకుంటున్నామని తెలిపారు.



కానీ తమకు జరిగిన ఈ పరాభవంపై పెళ్లికూతురు తరపువారు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవటం గమనించాల్సిన విషయం. కానీ ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.