గేదెకు నివాళులు, దినకర్మలు..ఊరంతా అన్నదానం

గేదెకు నివాళులు, దినకర్మలు..ఊరంతా అన్నదానం

UP : death buffalo 13 day Annadanam : పెంపుడు జంతువులు చనిపోతే వాటి జ్ఞాపకార్థంగా అన్నదానాలు చేయటం గురించి విన్నాం. కానీ యూపీలోని మీరట్‌ లో ఓ కుటుంబానికి చెందిన గేదె చనిపోయింది. ఆ గేదెకు యజమాని ఘనంగా నివాళులు అర్పించాడు. అచ్చం మనుషులకు చేసినట్లుగా దశదిన కర్మలు నిర్వహించాడు. ఆ తరువాత చక్కటి పిండివంటతో వంటలు చేయించి ఊరందరికి అన్నదానం చేశాడు.

  

గేదెకు కర్మలు చేసి అన్నదానం చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన గేదెకు నివాళులు అర్పించారు.గేదెకు అంత ఆర్భాటంగా కార్యక్రమాలు చేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మీరట్ సమీపంలోని మొహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్ వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం అంటే గేదెలు, ఆవులు ఉండటం కామెనే.అలా సుభాష్ గత 32 ఏళ్లుగా ఒక గేదెను కూడా సంరక్షిస్తున్నాడు. ఈ మధ్య కొంతకాలంగా ఆ గేదె పాలు ఇవ్వడం మానేసింది.

సుభాష్‌కు ఆ గేదెతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అది అనా అనారోగ్యం ఉండటం భరించలేకపోయాడు. దానికి పశువుల వైద్యుడితో వైద్యం చేయించాడు. ఎంతో డబ్బు ఖర్చు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. గేదెను కాపాడుకోలేకపోయాడు.ఆ గేదె మృతి చెందడంతో సుభాష్ కుటుంబ సభ్యులంతా ఇంటిలో మనిషే చనిపోయినట్లుగా బాధపడ్డారు.

అలా చనిపోయిన ఆ గేదెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆది మృతి చెందిన పదమూడవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు గ్రామస్తులందరికీ అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేదె శ్రద్ధాంజలి సభకు గ్రామస్తులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఆ గేదె తమ ఇంటిలో సభ్యురాలిగా మెలిగిందని, దాని ఆత్మశాంతి కోసం సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించామన్నామని తెలిపారు.