Uttar pradesh: మంత్రిని కరిచిన ఎలుక.. పాము అనుకొని..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు...

Uttar pradesh: మంత్రిని కరిచిన ఎలుక.. పాము అనుకొని..

Up Ministar

Uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు. పేదలకు మెరుగైన పాలన అందేలా, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని, ఇందుకోసం మీకు కేటాయించిన ప్రాంతాల్లో నిత్యం పర్యటించాలని ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రులకు సూచించారు. అంతేకాదు అధికారిక కార్యక్రమాల సమయంలో మంత్రులు, అధికారులు ప్రైవేట్ హోటళ్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లలో మాత్రమే సేదతీరాలని యోగి ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం

సీఎం ఆదేశాలతో మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ బండా జిల్లాలో ఆదివారం పర్యటించారు. రాత్రి బండాలోని ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. సోమవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో కుడిచేతి వేలు నొప్పిగా ఉండటంతో అకస్మాత్తుగా నిలేచిన మంత్రి తనకు ఏదో విషపు పురుగు కరించిందని భావించారు. ఏదో కరిచినట్లు ఉండటంతో పాటు, రక్తపు చుక్కను గమనించి పాము కరిచిందేమోనన్న అనుమానంతో వెంటనే కార్యకర్తలు, అధికారులకు సమాచారం అందించారు. జిల్లా మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సహా సీనియర్ జిల్లా అధికారులు గెస్ట్ హౌస్ కు చేరుకొని హుటాహుటీన మంత్రిని ఆస్పత్రికి తరలించారు.

Uttarpradesh : యోగి 7 రికార్డులు..పూర్తి వివరాలు

జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎన్ మిశ్రా పర్యవేక్షణలో వైద్యులు చికిత్స ప్రారంభించారు. పలు పరీక్షల అనంతరం చివరకు ఎలుక కొరికిందని నిర్దారించడంతో మంత్రితోపాటు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి బసచేసిన గెస్ట్ హౌస్ చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో తొలుత పాము కరిచి ఉంటుందని మంత్రి భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సిబ్బంది గెస్ట్ హౌస్ అన్ని గదులు గాలించి ఎలుకను పట్టుకున్నారు. అయితే చికిత్స అనంతరం సోమవారం ఉదయం 6గంటల సమయంలో వైద్యులు మంత్రిని డిశ్చార్జి చేశారు.