PM Modi in Gym : ‘ఫిట్ ఇండియా’ సందేశం.. జిమ్‌లో ప్రధాని మోడీ వర్కౌట్లు

‘ఫిట్ ఇండియా’సందేశంతో..జిమ్ లో ప్రధాని మోడీ ఎక్సర్ సైజ్ లు చేశారు. 71 ఏళ్ల వయస్సులో మోడీ కసరత్తులు చేస్తున్న వీడియో వైరల్ గా అవుతోంది.

PM Modi in Gym : ‘ఫిట్ ఇండియా’ సందేశం.. జిమ్‌లో ప్రధాని మోడీ వర్కౌట్లు

Pm Modi In Gym Video

PM Modi in Gym : 71 ఏళ్ల వయస్సులో ప్రధాని నరేంద్ర మోడీ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ‘ఫిట్ ఇండియా’ అంటూ సందేశం ఇస్తూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ ఆదివారం (జనవరి 2,2022) శంకుస్థాపన చేసిన సందర్భంగా.. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్నిస్తూ కసరత్తులు చేశారు.

Read more :  PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ

మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్లిన మోడీ అక్కడి కాంప్లెక్స్‌లో ఉన్న జిమ్‌ను సంద‌ర్శించారు. కాసేపు జిమ్‌లో బాడీవెయిట్ లాట్‌పుల్ మెషీన్‌తో ఎక్సర్‌సైజ్ చేశారు. ప్రధాని 15 సార్లు ఆ మెషీన్‌ను కిందికి పైకి చేస్తూ ఎక్సర్‌సైజ్ చేశారు.

కాగా.. ప్రధాని మోడీ ఫిట్‌నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. వాకింగ్ ఆయన దినచర్యలో తప్పనిసరి. ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా.. వాకింగ్, యోగా వంటివి తప్పనిసరిగా చేస్తారు. తానే కాదు దేశ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని చెబుతుంటారు. చిన్న చిన్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. ఈక్రమంలో జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తు..ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలంటే “ఫిట్ నెస్ డోస్, రోజూ అరగంట” అనే సందేశం ఇచ్చారు.

Read more :  PM Modi Varanasi Tour : దివ్యాంగురాలి పాదాలకు మొక్కిన ప్రధాని మోదీ.. ఫొటో వైరల్

ఈ సందర్భంగా ప్రధాని..‘‘మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు, మనం ఫిట్ గా ఉంటాం.ఆరోగ్యంగా ఉంటాం. ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా విజయం సాధిస్తాం‘‘ అని మోడీ చెప్పారు. ఆరోగ్యానికి.. ఆత్మవిశ్వాసానికి యోగా చాలా మంచిదని చెబుతుంటారనీ.. యోగా, భంగిమ, వ్యాయామం, నడక, రన్నింగ్, హెల్తీ డైట్, స్విమ్మింగ్ ఇవన్నీ మన దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రధాని మోడీ తెలిపారు.