ఈ కుక్కలకు మంచి రోజులొచ్చాయి : 100 ఎకరాల స్థలంలో వీధికుక్కలకు ఆవాసం..కడుపు నిండా భోజనం

ఈ కుక్కలకు మంచి రోజులొచ్చాయి : 100 ఎకరాల స్థలంలో వీధికుక్కలకు ఆవాసం..కడుపు నిండా భోజనం

UP : special house for stray dogs in ghaziabad : రోడ్లమీద వీధికుక్కలు కనిపిస్తే అవెక్కడ కరుస్తాయోననీ..భయపడతాం. కానీ వీధుల్లో తిరిగేకుక్కలు ఏం తింటున్నాయి? వాటికి రోజు కడుపు నిండుతోందా? లేదా ఆకలితోనే పడుకుంటున్నాయా? అని మనం ఎప్పుడూ ఆలోచించం..పైగా ఎక్కడపడితే అక్కడ వీధుల్లో కుక్కలు కనిపిస్తే..ఛీ..ఏంటీ పాడు కుక్కలు అంటూ విసుక్కుంటాం. కానీ వాటి గురించి ఆలోచించేవారే ఉండరు. సంరక్షించే పనికూడా ఎవ్వరూ పెట్టుకోరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉండే రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ క్యాంపస్‌లో ఎన్నో వీధుకుక్కలు కనిపిస్తాయి. రోడ్లపై తిరిగే కుక్కలకు ఇక్క ప్రత్యేక ఆవాసాన్ని రూపొందించారు.

ఘాజియాబాద్‌లోని రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ సొసైటీకి 100 ఎకరాల స్థలం ఉంది. రోడ్డుపై తిరిగే కుక్కల్ని తీసుకొచ్చి వారికి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. 25 డాగ్ హౌస్‌లను ఏర్పాటు చేశారు.వాటిలో కుక్కల్ని పెట్టి చక్కగా పోషిస్తున్నారు. మూడు పూటలా ఆహారాన్ని పెడతారు. ఘాజియాబాద్‌‌లో వీధి కుక్కలు చాలా భారీ సంఖ్యలో ఉండేవి. వాటి బెడద ఎక్కువ కావటంతో ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఎన్నో ఫిర్యాదు చేశారు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో రామ్‌ప్రస్థ్ గ్రూప్ వీధికుక్కల కోసం ముందడుగు వేసింది. వీధి కుక్కల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సంస్థ మొత్తం 70 వీధికుక్కల ఆలనాపాలనా చూస్తోంది. వాటి తిండి ఖర్చు అంతా సంస్థే భరిస్తోంది. ఈ 100 ఎకరాల స్థలంలో డాగ్ హౌస్‌లను నిర్మించి వాటిలో కుక్కల్ని ఉంచి సంరక్షిస్తోంది. కుక్కలకు కావాల్సిన ఆహారంతో పాటు లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. సొసైటీకి చెందిన ఓ మహిళ ఈ కుక్కలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. సొసైటీలోని సభ్యులు కూడా శునకాల సంరక్షణకు తమవంతు నగదు, సరుకుల సహాయం చేస్తుంటారు.

అలా వీధికుక్కల సమస్య ప్రజలకు తప్పించినట్లుగా ఉంటుంది. ఆ కుక్కలను సంరక్షించినట్లుగానూ ఉంటుందని భావించిన రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ సంస్థ వాటి బాద్యతను తీసుకుంది. ఈ సందర్భంగా రామప్రస్థ్ గ్రూప్ జనరల్ మేనేజర్ భాస్కర్ గాంధీ మాట్లాడుతూ..కొంతకాలం క్రితం వీధికుక్కల సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారునిగుర్తుచేశారు. ఈ ఆయన పిలుపుతో తాము వీధి శునకాల సంరక్షిస్తున్నామని తెలిపారు.